కోమటిరెడ్డి బ్రదర్స్‌పై మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి మండిపడ్డారు. కోమటిరెడ్డి బ్రదర్స్ కోవర్టురెడ్డి బ్రదర్స్ అని విమర్శించారు. అసెంబ్లీలోని శాసనసభాపక్ష కార్యాలయంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, పార్టీ నేతలతోకలిసి ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మీడియాతో మాట్లాడారు.
మునుగోడులో టీఆర్ఎస్ గెలుపు ఖాయమని…ప్రజలంతా రాజగోపాల్ రెడ్డికి బుద్ది చెప్పాలన్నారు. రూ.18 వేల కోట్ల కాంట్రాక్ట్ కోసం కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారని ఆరోపించారు.
బీజేపీకి తెలంగాణ అంటే కక్ష అని…రాష్ట్రానికి ఆ పార్టీ చేసిందేమీ లేదని మండిపడ్డారు. బయ్యారంలో ఇనుప ఖనిజం నాణ్యమైనది కాదని కిషన్‌రెడ్డి చెప్పడం సిగ్గుచేటన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను కేంద్రం కాలరాస్తున్నదని ఫైరయ్యారు. బడుగు, బలహీనవర్గాల జీవితాలు నాశనమయ్యాయని ఆవేదన వ్యక్తంచేశారు. దేశంలో ఆహార కొరత తీవ్రంగా వేధిస్తున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. దీనిపై కేంద్రం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.