కిషన్ రెడ్డిపై కడియం ఫైర్

107
kadiyam
- Advertisement -

కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై మండిపడ్డా ఎమ్మెల్సీ కడియం శ్రీహరి. కేంద్రం తెలంగాణకు ఇచ్చిన ఏ ఒక్క విభజన హామీ నెరవేర్చలేదని చెప్పారు. మండలిలో మాట్లాడిన కడియం.. బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులు చేతకాని చవటలు, దద్దమ్మలు కేంద్ర ప్రభుత్వ చర్యలను ఖండిస్తున్నం అన్నారు.

తెలంగాణలో కులాలు, మతాల మధ్య గొడవలు పెట్టి, మతచిచ్చు మంటల్లో చలి కాచుకుందామంటే తెలంగాణ ప్రజలు సహించరని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ముక్త భారత్ కావాలి. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలన్నారు.

ఢిల్లీ నుంచి గల్లీ దాకా బీజేపీ నాయకులు, కేంద్ర మంత్రులు కేసీఆర్‌ను చూసి భయపడుతున్నారు. బండి సంజయ్, కిషన్ రెడ్డికి తెలంగాణపై చిత్తశుద్ధి ఉంటే విభజన హామీలు అమలు చేసేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు.

- Advertisement -