వరంగల్ కాంగ్రెస్ అభ్యర్థిగా కడియం కావ్యను ప్రకటించింది కాంగ్రెస్ అధిష్టానం. ఇటీవలె సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు కడియం శ్రీహరి, కడియం కావ్య. దీంతో ఇప్పటివరకు 14 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా ఖమ్మం, హైదరాబాద్, కరీంనగర్ స్థానాలను పెండింగ్‌లో పెట్టారు.
ఖమ్మం స్థానానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి నందిని,మంత్రి పొంగులేటి సోదరుడు ప్రసాద్ రెడ్డి పోటీ పడుతున్నారు. కరీంనగర్ స్థానం నుంచి తీన్మార్ మల్లన్న మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి పోటీ పడుతున్నారు. హైదరాబాద్ నుండి మస్కత్ అలీని పోటీలో ఉండే అవకాశం ఉంది.
ఇప్పటివరకు వరంగల్- కడియం కావ్య,మహబూబ్ నగర్ – వంశీ చంద్ రెడ్డి,జహీరాబాద్ – సురేశ్ షెట్కార్,మహబూబాబాద్ – బలరాం నాయక్,నల్గొండ – కుందూరు రఘువీర్ రెడ్డి,మల్కాజ్‌గిరి – సునీతా మహేందర్ రెడ్డి,సికింద్రాబాద్ – దానం నాగేందర్,చేవెళ్ల – డాక్టర్ రంజిత్ రెడ్డి,నాగర్‌కర్నూల్ – మల్లు రవి,పెద్దపల్లి – గడ్డం వంశీకృష్ణ,ఆదిలాబాద్- డాక్టర్ సుగుణ కుమారి చెలిమల,నిజామాబాద్- తాటిపర్తి జీవన్ రెడ్డి,మెదక్- నీలం మధు,భువనగిరి- చామల కిరణ్ కుమార్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది కాంగ్రెస్.
Also Read:Gold Rate:రికార్డు స్థాయికి జంప్