సిద్దిపేట మున్సిప‌ల్ చైర్మ‌న్‌,వైస్ చైర్మ‌న్‌లు ఖరారు‌‌..

43

సిద్దిపేట మున్సిప‌ల్ చైర్మ‌న్‌, వైస్ చైర్మ‌న్ల పేరును టీఆర్ఎస్ అధిష్టానం ఖ‌రారు చేసింది. చైర్మ‌న్‌గా క‌డ‌వేర్గు మంజుల‌, వైస్ చైర్మ‌న్‌గా జంగిటి క‌న‌క‌రాజు ఎన్నికయ్యారు. నూతన కార్పొరేటర్ల సమావేశంలో చైర్మ‌న్, వైస్ చైర్మ‌న్ అభ్యర్థుల పేర్ల‌ను మంత్రి హరీష్ రావు, ఎన్నిక పరిశీలకులు రవీందర్ సింగ్, ఒంటెరు ప్రతాప్ రెడ్డి క‌లిసి ప్ర‌క‌టించారు. సిద్దిపేట మున్సిపాలిటీలో మొత్తం 43 వార్డుల‌కు గానూ టీఆర్ఎస్ 36, బీజేపీ 1, ఇత‌రులు 6 స్థానాల్లో గెలుపొందారు. టీఆర్ఎస్ రెబ‌ల్స్ అంద‌రూ మంత్రి హ‌రీష్ రావు స‌మ‌క్షంలో గులాబీ కండువా క‌ప్పుకున్నారు. అలాగే జడ్చర్లలో దోరెపల్లి లక్ష్మి, నకిరేకల్‌లో రాచకొండ శ్రీను, అచ్చంపేటలో నర్సింహగౌడ్‌ ల పేర్లను సీఎం ఖారారు చేశారు.