కడప టూ హైదరాబాద్‌కు విమాన సర్వీసులు!

3
- Advertisement -

రాష్ట్రంలో పౌర విమానయాన సర్వీసులతోపాటు, రైల్వేలో ప్రజా రవాణాను మరింత మెరుగుపరిచేందుకు కూటమి ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంతుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. కడప నుంచి హైదరాబాద్ కు కనెక్టివిటీ ఇండిగో విమాన సర్వీసులను ఆయన ప్రారంభించారు.

కూటమి ప్రభుత్వంలో విమానాయన శాఖ మంత్రిగా రాష్ట్రానికి చెందిన రామ్మోహన్ రావు ఉండడం వల్లే రాష్ట్రంలో విమానాయన శాఖలో వేగవతమైన అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన చెప్పారు.

కడప నుంచి ఇతర దుర ప్రాంతాలకు మరిన్ని విమాన సర్వీసులు విస్తరించేందుకు చర్యలు చేపడుతున్నామని, త్వరలోనే ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామన్నారు.. రాష్ట్రంలో విద్యుత్ చార్జీల భారం పాపం గత వైసిపి ప్రభుత్వానిదే అన్నారు.

కూటమి ప్రభుత్వం విద్యుత్ చార్జీలు పెంచిందని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన వ్యాఖ్యలను మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఖండించారు. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి తక్కువ ధర కొనుగోలు చేయాల్సిన యూనిట్ విద్యుత్ ను ఐదు నుంచి ఏడు రూపాయలకు కొనుగోలు చేయడం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని, అయితే ప్రజలపై భారాలు పడకుండా ఈ ప్రభుత్వం చూస్తుందన్నారు. అనుభవజ్ఞుడైన చంద్రబాబుకు ఏం చేయాలో అన్ని తెలుసునని ఆయన అన్నారు.

Also Read:రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒక డీఏ:రేవంత్

- Advertisement -