మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఉదయమే అధికారులు అవినాష్ నివాసానికి చేరుకున్నారు. మొత్తం రెండు వాహనాల్లో పులివెందులలోని ఎంపీ అవినాష్ ఇంటికి వెళ్లారు సీబీఐ అధికారులు.
ఇదిలా ఉంటే వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్‌రెడ్డిని సీబీఐ ఇప్పటికే 4సార్లు ప్రశ్నించిన విషయం తెలిసిందే.ఇక రెండు రోజుల క్రితమే అవినాష్ అనుచరుడు ఉదయ్‌ని సీబీఐ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో తాజాగా అనివాష్ విచారణ సర్వత్రా ఉత్కంఠతను రేపుతోంది.
ఏం జరగనుందన్న దానిపై అందరిలోనూ ఆసక్తి పెరిగింది. అవినాష్‌ను అధికారులు ఏం అడగనున్నారు.? అన్నదానిపై ఆసక్తినెలకొంది.ఇక ఉదయ్ రెడ్డి విచారణలో భాగంగా అతని ఫోన్‌లో ఆసక్తికర విషయాలు వెల్లడైనట్లు సీబీఐ రిపోర్ట్‌లో వెల్లడించారు.వివేకానందారెడ్డి మర్డర్‌కేసులో ఉదయ్‌కుమార్‌రెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించారు న్యాయమూర్తి.
వెంటనే మాసబ్‌ట్యాంక్‌లోని జడ్జి ఇంటి నుంచి ఆయన్ని చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఎంపీ అవినాష్‌రెడ్డి ప్రధాన అనుచరుడైన ఉదయ్‌కుమార్‌రెడ్డిని సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకుని జడ్జి ఎదుట హాజరుపరిచారు. విచారణ అనంతరం న్యాయమూర్తి అతనికి ఈనెల 26 వరకూ రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. హైదరాబాద్ లోని ఎంపీ అవినాష్ రెడ్డి ఇంటి దగ్గర భారీగా పోలీసులు, సిబిఐ అధికారులను మోహరించారు.
ఇవి కూడా చదవండి..