ఆయన మానవత్వం గుండె గుండెను తాకుతోంది.. నిస్సాహయకులకు ‘మనం సైతం’ అంటూ ఆదుకుంటున్నారు. ఆపద వచ్చిన వారి వద్దకి ఆయనే వెళ్లి అండగా నిలబడుతున్నారు. విపత్కర పరిస్థితులు ఎదురవుతే అక్కడ ఆయన ప్రత్యక్షమవుతారు. చేతనైన సాయం కోసం ఎప్పుడైనా, ఎవరికైనా, ఎక్కడైనా.. మనం సైతం! అంటూ సాయం చేస్తున్నారు మనసున్న మారాజు సినీ నటుడు,‘మనం సైతం’ ఫౌండేషన్ నిర్వహకులు కాదంబరి కిరణ్. తాజాగా సినీ, టీవీ నటుడు డీ. వీరభద్రయ్యకు ఆర్థిక సాయం చేశారు.
హైదరాబాద్: సినీ నటుడు,‘మనం సైతం’ ఫౌండేషన్ నిర్వహకులు కాదంబరి కిరణ్ మరోసారి దాతృత్వం చాటుకున్నారు. ప్రమాదానికి గురై ఆందోళనకరమైన పరిస్థితుల్లో హస్పిటల్‌లో చేరిన సినీ, టీవీ నటుడు డీ. వీరభద్రయ్యకు రూ. 25,000 చెక్కును ఆర్థిక సాయంగా అందించారు. వీరభద్రయ్యకు మెరుగైన వైద్యం, కనీస అవసరాలను తీర్చేలా ఈ సాయం చేశారు. వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. డీ. వీరభద్రయ్య కుటుంబానికి అండగా ఉంటానంటూ వారిలో ధైర్యం నింపారు. ఇలా నిరంతరం దాతృత్వం కొనసాగిస్తున్న ఆయన మానవత్వానికి పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఎన్నో సంవత్సరాలుగా కాదంబరి కిరణ్ సినీ పరిశ్రమలో పేద కార్మికులకు, అవసరాల్లో ఉన్న పేదలకు సహాయం చేయడానికి ‘మనం సైతం'(Manam Saitham) అనే ఫౌండేషన్ స్థాపించారు. పదేళ్లుగా ‘మనం సైతం’ ఫౌండేషన్ ద్వారా కాదంబరి కిరణ్ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు.
Also Read:బాలయ్య సినిమా వర్కౌట్ అవుతుందా?