గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొన్న కాదంబరి కిరణ్ ఫ్యామిలీ..

92
kiran
- Advertisement -

ప్రముఖ నటులు, మనం సైతం సేవా సంస్థ వ్యవస్థాపకులు కాదంబరి కిరణ్ కుటుంబ సభ్యులు ఇవాళ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాదంబరి కిరణ్ గారి పెద్ద కుమార్తె సత్య శ్రీకృతి, ఈశ్వర్ వివాహ మహోత్సవాన్ని పురస్కరించుకుని చిత్రపురి కాలనీలోని ఆయన స్వగృహం వద్ద 100 మొక్కలతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా నూతన వధూవరులతో మొక్కలు నాటించారు. ఈ కార్యక్రమంలో చిత్రపురి కాలనీ అధ్యక్షులు వల్లభనేని అనిల్ కుమార్, వసంతరావు, చిత్రపురి కమిటీ సభ్యులు దీప్తి వాజ్ పాయ్, అనిత నిమ్మగడ్డ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కాదంబరి కిరణ్ మాట్లాడుతూ…నా కుమార్తె సత్య శ్రీకృతి, ఈశ్వర్ వివాహ మహోత్సవాన్ని పురస్కరించుకుని ఇవాళ మా ఇంటి వద్ద 100 మొక్కలతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. నూతన వధూవరులతో మొక్కలు నాటించి, పర్యావరణ హితమైన గొప్ప కార్యక్రమంలో కుటుంబ సమేతంగా భాగస్వామ్యులం కావడం సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమంలో నా సోదరుడు, చిత్రపురి కాలనీ అధ్యక్షులు వల్లభనేని అనిల్ కుమార్, మిత్రులు వసంతరావు పాల్గొనడం ఆనందంగా ఉంది అన్నారు.

- Advertisement -