కాబోయే పాన్ ఇండియా బ్యూటీ ఆమె!

46
- Advertisement -

యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ కి అందమే కాదు .. అదృష్టం కూడా గట్టిగానే ఉంది. అందువల్లనే కెరీర్ లో ఫ్లాపులు ఎక్కువ పడినప్పటికీ, ఆ వెంటనే జాన్వీ కపూర్ కి బ్లాక్ బస్టర్ కాంబినేషన్ సినిమాలు పడుతూ వస్తున్నాయి. పైగా జాన్వీ కపూర్ ఎప్పటికప్పుడు తన గ్రాఫ్ ను పెంచుకుంటూ వస్తోంది. అటు పాన్ ఇండియా స్టార్ హీరోయిన్స్ రేసులోనూ చాలా స్పీడ్ గా కొనసాగుతున్న హీరోయిన్ కూడా జాన్వీ కపూర్ నే. ‘ఎన్టీఆర్ – కొరటాల శివ’ సినిమా ఆఫర్ తో తను పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ అయిపోయింది.

ఇప్పుడు జాన్వీ కపూర్ యష్ కొత్త సినిమాలోనూ ఓ కీలక పాత్రలో నటిస్తోందట. ఈ సినిమా కథ మొత్తం జాన్వీ కపూర్ చుట్టే తిరుగుతుందట. సహజంగా యష్ లాంటి స్టార్ హీరో సినిమాలో హీరో పాత్రే హైలైట్ అవుతుంది. అలాంటిది జాన్వీ కపూర్ పాత్ర చుట్టే కథ మొత్తం తిరగడం నిజంగా విశేషమే. అన్నట్టు జాన్వీ కపూర్ లిస్ట్ లో రణబీర్ కపూర్ సినిమా కూడా ఉంది. ఈ చిత్రం భారీతనంతో నిర్మితమవుతోంది. పైగా ఇది పాన్ ఇండియా సినిమా. భారీ వసూళ్లను రాబట్టే సినిమా.

హిందీలో రణబీర్ సినిమా 200 కోట్లకి పైగా వసూళ్లను సాధించే అవకాశం ఉంది. ఎన్టీఆర్ సినిమా రేంజ్ కూడా అదే. సో జాన్వీ కపూర్ రేంజ్ నేషనల్ రేంజ్ కి పాకి పోతుంది. అందుకే.. మరో సినిమా ఏదీ జాన్వీ కపూర్ ఫైనల్ చేయడం లేదు. ఇక చరణ్ తో సుకుమార్ చేయాలనుకున్న ప్రాజెక్టులోనూ జాన్వీ కపూర్ పేరే వినిపిస్తోంది. కానీ ఇది ఇప్పట్లో పట్టాలెక్కేలా లేదు. ఒకవేళ ఈ సినిమా పడితే జాన్వీ కపూర్ నెంబర్ వన్ పాన్ ఇండియా హీరోయిన్ పొజిషన్ కి రీచ్ అయినట్టే.

ఇవి కూడా చదవండి…

ఈ వారం ఓటీటీ సినిమాలివే..

ట్రోలింగ్ హీరో స్టన్నింగ్ లుక్

RRR టీంకి ప్రధాని,సీఎంల అభినందనలు

- Advertisement -