కాబోయే భార్య ఫోటోను షేర్ చేసిన మనోజ్‌..

32
- Advertisement -

టాలీవుడ్‌ నటుడు మంచు మనోజ్‌ గుడ్‌న్యూస్‌ చెప్పాడు. తాను మరోసారి వివాహబంధంలోకి అడుగుపెడుతున్నట్టు ప్రకటించారు. తను పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి ఫోటోను ట్వీట్టర్ వేదికగా పంచుకున్నారు. పెళ్లికూతురు భూమా మౌనికా రెడ్డి అని పేర్కొన్నారు. #mwedsM #manojWedsMounika అనే హ్యాష్‌ట్యాగ్స్‌ను జత చేశారు. మనోజ్‌కు 2015లోనే ప్రణతీరెడ్డితో పెళ్లి జరిగింది. అయితే పరస్పర అంగీకారంతో 2019లో వీరిద్దరూ విడిపోయారు.

మనోజ్ వివాహంపై ఇప్పటికే పలుమార్లు వార్తలు బయటకు వచ్చాయి. అయితే ఇప్పటి వరకు మనోజ్ తన పెళ్లి గురించి ఎప్పడు బహాటంగా బయటకు చెప్పలేదు. కానీ తన కాబోయే సతీమణిని శుక్రవారం ఉదయం పరిచయం చేశారు. ఈ రోజు రాత్రి వీరి వివాహం జరగనున్నట్లు టాలీవుడ్‌లో టాక్‌. అయితే వీరిద్దరి పెళ్లికి జూ.ఎన్టీఆర్ తప్పక హాజరు అవుతారని టాలీవుడ్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది.

ఇవి కూడా చదవండి…

టార్గెట్ అవుతున్న ఎన్టీఆర్?

అరవింద్ స్వామి..నయా లుక్‌

‘అర్జున్ రెడ్డి’ దర్శకుడితో అల్లు అర్జున్

- Advertisement -