హీరో లేకుండా ఫస్ట్ లుక్‌

172
Kaaru First Look
- Advertisement -

యంగ్ హీరో నాగశౌర్య ప్రతి ఏడాది వరుస సినిమాలతో ఫుల్ బిజీ అవుతున్నాడు. గత ఏడాది కళ్యాణ వైభోగమే.. ఒక మనసు.. జ్యో అచ్యుతానంద.. నీ జతలేక..అంటూ ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చిన ఈ కుర్ర హీరో ఈ ఏడాది కూడా జోరు పెంచుతున్నాడు. వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న నాగశౌర్య ఆ సినిమాకి తానే నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఇక సుందర్ దర్శకత్వంలో ‘అమ్మమ్మ గారి ఇల్లు’ అనే చిత్రాన్ని చేస్తున్నాడు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రూపొందుతోంది. శ్రీరామ్ దర్శకత్వంలోను ఒక సినిమా చేయడానికి నాగశౌర్య సిద్ధమవుతున్నాడు.

వీటితో పాటు తమిళ దర్శకుడు ఎ.ఎల్.విజయ్ దర్శకత్వంలో  ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతున్న కారు చిత్రంలో నటిస్తున్నాడు. తమిళ, తెలుగు భాషల్లో  తెరకెక్కుతున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ను ప్రభుదేవా చేతుల మీదుగా లాంచ్ చేశారు.

ఈ ఫస్ట్ లుక్‌లో నాగశౌర్యకు చోటు దక్కలేదు. హీరోయిన్ సాయిపల్లవి మాత్రమే కనిపిస్తోంది. ఆమెను కూడా క్లోజప్‌లో చూపించలేదు.  అయితే ఫస్ట్ లుక్‌ చాలా వెరైటీగా.. పొయెటిగ్గా కనిపిస్తోంది ఈ ఫస్ట్ లుక్. నాగశౌర్య, సాయి పల్లవిలకు ఇదే తొలి తమిళ సినిమా.

మలయాళ ‘ప్రేమమ్’తో తమిళ ప్రేక్షకుల్లోనూ మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న సాయిపల్లవికి ఇంతకుముందు మంచి మంచి ఆఫర్లు వచ్చినట్లే వచ్చి మిస్సయ్యాయి. అయితే,తాజాగా వరుస ఆఫర్లతో ఈ ప్రేమమ్ బ్యూటీ బిజీగా ఉంది. ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సాయిపల్లవి ‘ఫిదా’ సినిమా చేస్తోంది. ఈ సినిమా తరువాత నాని సరసన ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాజాగా  నాగశౌర్యతో కారు సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.

- Advertisement -