నవంబర్ 14న ‘కాంత’

5
- Advertisement -

దుల్కర్ సల్మాన్ పీరియాడికల్ మూవీ ‘కాంత’ టీజర్‌తో సంచలనం సృష్టించింది. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన ఈ తమిళ-తెలుగు ద్విభాషా చిత్రంలో దుల్కర్ సరసన భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించింది. సముద్రఖని కీలక పాత్ర పోషిస్తున్నారు.

స్పిరిట్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, వేఫేరర్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌లపై రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ పొట్లూరి, జోమ్ వర్గీస్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. కాంత ఫస్ట్ సింగిల్ హే పసి మనసే కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

మేకర్స్ తాజాగా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. కాంత నవంబర్ 14న వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది. దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే, సముద్రఖని వింటేజ్ అండ్ ఇంటెన్స్ లుక్స్ లో కనిపించిన రిలీజ్ డేట్ పోస్టర్ చాలా క్యురియాసిటీ పెంచింది.

ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ డానీ సాంచెజ్ లోపెజ్, ఆర్ట్ డైరెక్షన్‌ను థా. రామలింగం. అదనపు స్క్రీన్‌ప్లేను తమిళ్ ప్రభ ఇచ్చారు. లెవెలిన్ ఆంథోనీ గోన్సాల్వెస్ ఎడిటర్.తారాగణం: దుల్కర్ సల్మాన్, సముద్రఖని, భాగ్యశ్రీ బోర్సే
సాంకేతిక సిబ్బంది:
దర్శకత్వం: సెల్వమణి సెల్వరాజ్
బ్యానర్లు: స్పిరిట్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, వేఫేరర్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్
నిర్మాతలు: రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ పొట్లూరి, జోమ్ వర్గీస్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – సాయికృష్ణ గద్వాల్, సుజయ్ జేమ్స్
లైన్ ప్రొడ్యూసర్ – శ్రవణ్ పాలపర్తి
DOP – డాని శాంచెజ్ లోపెజ్
ఆర్ట్ డైరెక్టర్ – తా. రామలింగం
అదనపు స్క్రీన్ ప్లే – తమిళ్ ప్రభ
సంగీతం – ఝను చంతర్
ఎడిటర్ – లెవెల్లిన్ ఆంథోనీ గోన్సాల్వేస్
కాస్ట్యూమ్ డిజైనింగ్: పూజిత తాడికొండ, అర్చనరావు, హర్మాన్ కౌర్
PRO: వంశీ-శేఖర్

Also Read:కే ర్యాంప్..బ్రేక్ ఈవెన్!

- Advertisement -