TVKలో చేరిన సెంగొట్టయ్యన్

8
- Advertisement -

విజయ్ సమక్షంలో టీవీకేలో చేరారు మాజీ ఎమ్మెల్యే కే.ఏ. సెంగొట్టయ్యన్. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన కే.ఏ. సెంగొట్టయ్యన్ 1977లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. పశ్చిమ తమిళనాడులో ఆయనకు బలమైన నేతగా పేరుంది. ఏఐఏడీఎంకే విభజన సమయంలో జయలలితాకు అండగా నిలిచిన కీలక నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు.

తాజాగా పార్టీకి వ్యతిరేక నాయకులతో కలిసి పనిచేయడం, పార్టీ ఐక్యాన్ని కోరడం వంటి కారణాలతో ఏఐఏడీఎంకే నుండి బహిష్కరించబడిన సెంగొట్టయ్యన్..టీవీకేలో చేరారు. విజయ్ సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో సెంగొట్టయ్యన్ తన అనుచరులతో కలిసి కొత్త పార్టీ కండువా కప్పుకున్నారు. సెంగొట్టయ్యన్ అనుచరులు కూడా పెద్ద ఎత్తున టీవీకేలో చేరడం, కొత్త పార్టీకి బలం చేకూరుస్తుంది.

సెంగొట్టయ్యన్ పార్టీ మార్పు వల్ల తమిళనాడు రాజకీయాల్లో విభేదాలు మరింత తెరపైకి వచ్చినట్టే కనిపిస్తోంది. రాబోయే ఎన్నికల సందర్భంలో ఈ పరిణామం ఏఐఏడీఎంకే బలం, కూటముల సమీకరణాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. పశ్చిమ తమిళనాడులో ఆయనకు ఉన్న మద్దతు టీవీకేకు కొత్త ఊపు ఇచ్చే అవకాశముంది.

గోబిచెట్టిపాళయం సమీపంలోని కుల్లంపాళయం గ్రామానికి చెందిన సెంగొట్టయ్యన్‌.. తొమ్మిది సార్లు ఎమ్మెల్యే. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తర్వాత, సెంగొట్టయ్యన్ టీవీకేలో చేరడం విశేషం.

Also Read:యునెస్కోలో అంబేద్కర్ విగ్రహం..మోదీ హర్షం

- Advertisement -