పవన్ కల్యాణ్‌పై కేఏ పాల్ ధ్వజం

3
- Advertisement -

తెలంగాణలో జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ప్రజాశాంతి పార్టీ అధినేత డాక్టర్ కేఏ పాల్ తీవ్రంగా స్పందించారు. ప్రాంతాల మధ్య గొడవలు పెట్టేలా మాట్లాడటం సరికాదని ఆయన హితవు పలికారు.

ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమవుతున్నాయని కేఏ పాల్ విమర్శించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చమని ప్రజలు నిలదీస్తుంటే, ఆ విషయాలను పక్కనపెట్టి ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఏంటని ఆయన ప్రశ్నించారు. “ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం మానేసి, ఈ అనవసర గొడవలు ఎందుకు?” అంటూ పవన్ కల్యాణ్‌ను నిలదీశారు.

రాజకీయాల కోసం ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం న్యాయమా? ప్రజల సమస్యలను పరిష్కరించడంపై దృష్టి పెట్టండి అన్నారు కేఏ పాల్. ఈ వివాదాలన్నింటికీ స్వస్తి చెప్పి…ఒక మంచి కార్యక్రమానికి రావాలంటూ పవన్ కల్యాణ్‌కు కేఏ పాల్ ఈ సందర్భంగా ఒక ఆసక్తికరమైన ఆహ్వానాన్ని అందించారు. రాబోయే జూన్ 14న అమెరికాలోని హ్యూస్టన్ నగరంలో తాను ఒక భారీ బహిరంగ సభను నిర్వహించబోతున్నట్లు ఆయన ప్రకటించారు. ప్రపంచ శాంతి, ప్రగతి ధ్యేయంగా జరగబోయే ఈ సభకు పవన్ కల్యాణ్ కూడా హాజరుకావాలని కేఏ పాల్ పిలుపునిచ్చారు.

ప్రజా సమస్యలను పక్కదారి పట్టించడానికి ఇలాంటి ప్రాంతీయ వివాదాలను తెరపైకి తీసుకురావద్దని, అభివృద్ధిపై దృష్టి పెట్టాలని ఆయన కోరారు.

ALso Read:గ్రేట్ నికోబార్‌ను కాపాడుకుందాం!

- Advertisement -