USA:కాన్సాస్ స్టేట్ సెనేట్‌లో కేఏ పాల్

6
- Advertisement -

అమెరికాలోని కాన్సాస్ స్టేట్ సెనేట్లో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు డా. కే.ఏ. పాల్ ప్రత్యేకంగా ప్రసంగించారు. ఈ సందర్భంగా భారత్–అమెరికా మధ్య సంబంధాలు మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. ప్రపంచ శాంతి, స్థిరత్వం కోసం ఈ రెండు ప్రజాస్వామ్య దేశాలు కలిసి నాయకత్వ పాత్ర పోషించాలని ఆయన పిలుపునిచ్చారు.

ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం సుమారు 58 యుద్ధాలు కొనసాగుతున్నాయనీ, వాటి వల్ల లక్షలాది మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని డా. కే.ఏ. పాల్ ఆవేదన వ్యక్తం చేశారు. యుద్ధాల కారణంగా మానవ నష్టంతో పాటు, ట్రిలియన్ల డాలర్ల విలువైన సంపద వృథా అవుతోందని ఆయన అన్నారు. ఈ పరిస్థితి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీస్తోందని, పేదరికం, నిరుద్యోగం, వలసలు వంటి సమస్యలు మరింత పెరుగుతున్నాయని పేర్కొన్నారు.

యుద్ధాల స్థానంలో సంభాషణలు, దౌత్యం, శాంతియుత పరిష్కారాలు అవసరమని డా. పాల్ అభిప్రాయపడ్డారు. శాంతి సాధనలో భారత్, అమెరికా కీలక పాత్ర పోషించగలవని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధాలు వెంటనే ఆగిపోవాలని ఆయన ప్రత్యేకంగా ప్రార్థించారు.

శాంతి, మానవ విలువలు, సహజీవనం కోసం ప్రపంచ నాయకులు ఏకమవాల్సిన సమయం ఇదేనని డా. కే.ఏ. పాల్ తన ప్రసంగంలో స్పష్టం చేశారు.

Also Read:‘కనుమ’..ఎందుకు జరుపుకుంటారు?

- Advertisement -