అసెంబ్లీలో కేఏ పాల్..

24
- Advertisement -

తెలంగాణ అసెంబ్లీలో కేఏ పాల్ సందడి చేశారు. ప్రభుత్వం ఇవాళ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెట్టగా ఉదయాన్నే అసెంబ్లీకి వెళ్లిన పాల్… అధికారులు, నాయకులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిపై ప్రశంసల వర్షం కురిపించారు.

రేవంత్ రెడ్డి గొప్ప నాయకుడు అని కొనియాడిన పాల్… ఆయన వచ్చాక తెలంగాణ రాష్ట్రం పరిస్థితి మారుతుందని అన్నారు. రేవంత్ తో కలిసి ప్రపంచంలోని బిలియనీర్స్ ను కలిసి పెట్టుబడులు తెస్తామని అన్నారు. రేవంత్ ఇంగ్లీష్ పై విమర్శలు చేయడం తెలివి తక్కువవాళ్లు చేసే పని అన్నారు.

వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో వైజాగ్ నుంచి ఎంపీగా పోటీ చేస్తానని అన్నారు. ఏపీ సీఎం జగన్ వేస్ట్ ఫెలో …10లక్షల కోట్ల అప్పు చేశారంటూ విమర్శించారు.

Also Read:Telangana Budget:పూర్తి వివరాలివే

- Advertisement -