కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ హీరోగా కే46 సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. దర్శకుడు విజయ్ కార్తికేయ ఈ మూవీని తెరకెక్కిస్తుండగా అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తున్నాడు. వి క్రియేషన్స్ తో కలిపి సుదీప్ నిర్మిస్తున్నారు.
తాజాగా సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా కే46 డెమోన్ వార్ బిగిన్స్ అని టీజర్‌ని రిలీజ్ చేశారు. టీజర్ ఆధ్యంతం ఆసక్తిగా తీర్చిదిద్దారు. ఓ బస్సులో బుల్లెట్ గాయాలతో ఉన్న సుదీప్.. తనకి తానే ఒంట్లో నుంచి బుల్లెట్స్ తీసుకుంటూ కనిపించాడు. హీరోను చంపడానికి ఓ గ్యాంగ్ ట్రై చేయడం.. ఒకవేళ ఎవరి వల్ల కాకపోతే తమకు సిగ్నల్ ఇస్తే చూసుకుంటామని ఆసక్తికరంగా సాగింది.
Also Read:షిండే స్కెచ్ యేనా.. ఎన్సీపీలో కలకలం?
యుద్ధాన్ని ఆరంభించేవాడు నాకు నచ్చడు. యుద్ధానికి భయపడి పారిపోయే వాడూ నచ్చడు. రంగంలోకి దిగి, శత్రువులను వేటాడి, వెంటాడి, పారిపోయేలా చేసే వాడిని నేను.. దిగితే దయ, క్షమ వంటివేవీ చూడను. నేను మనిషిని కాదు.. భూతాన్ని అంటూ సుదీప్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకోగా మీరు ఓ లుక్కేయండి..

