మరోసారి దాతృత్వాన్ని చాటుకున్న మాజీ ఎంపీ కవిత

226
kavitha
- Advertisement -

మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత, మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. మానవతా దృక్పధంతో స్పందించి, అణగారిన వర్గాల పిల్లలలకు ఆన్ లైన్ క్లాసులు నిర్వహించేందుకు గాను, హైదరాబాద్ లోని సెయింట్ జోసెఫ్ సెకండరీ స్కూల్ కు మాజీ ఎంపీ ‌కల్వకుంట్ల కవిత, 9 కంప్యూటర్లను అందించారు.

హైదరాబాద్ లోని ఈస్ట్ మారేడ్ పల్లి కి చెందిన 77 ఏండ్ల వయస్సు గల బైలా గాబ్రియల్ సెయింట్ జోసెఫ్ పేరుతో పాఠశాలను నిర్వహిస్తున్నారు. 1993 లో ప్రారంభమైన ఈ పాఠశాలలో, సమాజంలో అణగారిన వర్గాల పిల్లలకు ఉచిత విద్యను అందిస్తూ, 27 ఏండ్లుగా వేలాదిమంది నిరుపేదలను విద్యావంతులుగా తీర్చిదిద్దింది గాబ్రియల్.అయితే కరోనా మహమ్మారి కారణంగా పాఠశాలల్లో విద్యను బోధించలేని పరిస్థితి నెలకొంది.

దీంతో ఆన్ లైన్ క్లాసులు ‌నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్న పాఠశాల యాజమాన్యానికి కంప్యూటర్ ల కొరత ఏర్పడింది. దీంతో ల్యాప్‌టాప్ లేదా కంప్యూటర్ లు అందించడానికి దాతలు ముందుకు రావాలని కోరుతూ, మేరికా ఇసాబెల్ ట్విట్ చేశారు.ట్వీట్ పై స్పందించిన మాజీ ఎంపీ కవిత, అణగారిన వర్గాల పిల్లల చదువులకు చేయూతనిచ్చేందుకు ముందుకు వచ్చారు.

ఆన్ లైన్ క్లాసులు నిర్వహించేందుకు గాను, 9 కంప్యూటర్ లను‌ అందించాలని‌ నిర్ణయించారు. గురువారం తెలంగాణ జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజీవ్ సాగర్, ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి, పాఠశాల యాజమాన్యానికి కంప్యూటర్ లను అందించారు. ట్వీట్ చేసిన వెంటనే ‌మానవత్వంతో‌ స్పందించి, వెనుకబడిన వర్గాల పిల్లల చదువులకై కంప్యూటర్ లను అందించిన మాజీ ఎంపీ కవిత, మేరికా‌ ఇసాబెల్, బైలా గాబ్రియల్, ఉపాధ్యాయులు ‌కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో మాజీ ఎంపీ కవిత చేసిన సాయం, పిల్లల భవిష్యత్తుకు ఎంతగానో దోహదపడతాయని మేరికా ఇసాబెల్ తెలిపారు.అయితే అణగారిన వర్గాల పిల్లలకు ఉచిత విద్య ను అందిస్తున్న బైలా గాబ్రియల్ కు ప్రత్యేకంగా అభినందనలు తెలిపిన మాజీ ఎంపీ కవిత, సెయింట్ జోసెఫ్ స్కూల్ కు భవిష్యత్తులో మరింత సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ట్వీట్ చేశారు.

- Advertisement -