మొక్కలు నాటిన అచ్ఛంపేట ఆర్డీవో పాండు..

328
rdo

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించారు అచ్ఛంపేట ఆర్డీవో పాండు. తన ఆఫీస్ కార్యాలయమూలో మొక్కలు నాటడం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మా జిల్లా కలక్టర్ల సహకారంతో గ్రామా స్థాయి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ తీసుకెళ్లే భాగంగా, అడిషనల్ కలెక్టర్ గారు విసిరినా ఛాలెంజ్ స్వీకరించి ఈరోజు మొక్కలు నాటడం జరిగింది అని తెలిపారు.

మారుతున్న వాతావరణ కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి వాటిని రక్షించాలని కోరారు.పచ్చదనాన్ని పెంచడం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారం దానికి మద్దతుగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కృషికి ప్రత్యేక అభినందనలు తెలిపారు . ఈ ఛాలెంజ్ ఇలానే విజయవంతంగా కొనసాగాలని మరో ముగ్గురికి అచ్చంపేట డిఎస్పీ నరసింహులు , అచ్చంపేట సీఐ రామకృష్ణ, అమ్రాబాద్ సీఐ బీసాన్నకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేశారు.