మమ్ముట్టితో జ్యోతిక!

78
- Advertisement -

మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ఈ ఏడాది వరుస సినిమాలతో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం నాలుగు సినిమాల్లో హీరోగా చేస్తుండగా మరో రెండు సినిమాలను లైన్‌లో పెట్టారు. వాటిలో ఒకటి ‘ద గ్రేట్ ఇండియన్ కిచెన్’ మూవీ తీసిన జో బేబీ డైరెక్షన్‌‌లో. ఈ చిత్రాన్ని మమ్ముట్టియే నిర్మించనుండగా ఫీమేల్ లీడ్‌గా జ్యోతిక కనిపించనున్నారు. జ్యోతికకు ఇది తొలి మలయాళ చిత్రం.

దీంతో పాటు రతీనా దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు మమ్ముట్టి. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘పుళు’ విమర్శకుల ప్రశంసలు దక్కాయి.

- Advertisement -