బాలీవుడ్‌లో లేడీ ఓరియంటెడ్ మూవీస్ చేయాలంటే ముందుగా వినిపించే పేరు విద్యాబాలన్. ఎలాంటి పాత్రైనా ఈ అమ్మడు అవలీలగా పోషించగలదు. గతంలో డర్టీ పిక్చర్ సినిమాతో బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా నిలిచింది విద్యాబాలన్. అలాగే గతేడాది ఈఅమ్మడు నటించిన ‘తుమ్హారి సులు’ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. ఈ మూవీలో విద్యాబాలన్.. సాధారణ గృహిణిగా.. రేడియో జాకీగా నటించి మెపించింది. అయితే ఇప్పుడు ఇదే సినిమాని కోలీవుడ్‌లో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాట్లు సమాచారం.
ఈ సినిమానిలో తమిళ హీరో సూర్య భార్య, నటి జ్యోతిక చేసే అవకాశం ఉందని వర్త ఒకటి వినిసిస్తుంది. అంతేకాదు ఈ మూవీలో విద్యాబాలన్ పాత్రను జ్యోతిక చేయడానికి ఒప్పుకుందని కూడా వర్తలు వెలువడుతున్నాయి. ఈమూవీని రాధామోహన్ దర్శకత్వం వహించనున్నాడు. మే నేలలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభంకానుందట. ఈ సినిమా తన కెరియర్‌లో ఒక గొప్ప సినిమాగా నిలుస్తుందిని ఎంతో నమ్మకంతో ఉందట జ్యోతిక.
జ్యోతిక హీరో సూర్యతో పెళ్లి అయ్యాక కొంతకాలం పాటు నటనకు ఫుల్ స్టాప్ పెట్టారు. చాలా కాలం గ్యాప్ తర్వాత ఇటీవలే సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది జ్యోతిక. అమె సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టాక.. ‘36 వయదినిలే’, ‘మగళిర్ మట్టుమ్’, ‘నాచియార్’ వంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించి అందరినీ అలరించారు. గతంలో జ్యోతికతో ‘మొళి’ అనే సినిమాను తెరకెక్కించిన దర్శకుడు రాధామోహన్.. ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు.