రవితేజ..ఇరుముడికి అదిరే రెస్పాన్స్

10
- Advertisement -

మాస్ మహారాజా రవితేజ, యూనిక్ స్టొరీ టెల్లింగ్, అద్భతమైన కథలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు శివ నిర్వాణతో చేతులు కలిపారు. #RT77 రవితేజ, శివ నిర్వాణ మధ్య ఫస్ట్ కొలాబరేషన్. ప్రముఖ పాన్-ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ నిర్మాణ విలువలతో హ్యుజ్ కాన్వాస్‌పై నిర్మిస్తోంది.

శివ నిర్వాణ పవర్ ఫుల్, యూనిక్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారు. రవితేజ ఇంతవరకు ఎప్పుడూ చేయని డిఫరెంట్ జానర్ మూవీ ఇది. కథలోని బలమైన ఎమోషన్‌, తన క్యారెక్టర్ ఆర్క్ కి ఇంప్రెస్ అయిన రవితేజ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమాకోసం ఆయన పూర్తిగా స్ట్రైకింగ్ మేకోవర్‌లో కనిపించబోతున్నారు.

ఇక రవితేజ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్‌ ‘ఇరుముడి’కి మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రంలో రవితేజ శ్రీ అయ్యప్ప స్వామి భక్తుడిగా కనిపించనుండటంతో అభిమానులు ఎంతో ఉత్సాహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఆయన చేసిన పాత్రలతో పోలిస్తే, ‘ఇరుముడి’లో రవితేజ పూర్తిగా భిన్నమైన పాత్రలో కనిపించబోతున్నారని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

పోస్టర్‌తో పాటు టైటిల్ కూడా బలమైన పాజిటివ్ బజ్‌ను సృష్టించింది. దర్శకుడు శివ నిర్వాణ ఈ చిత్రంలో రవితేజ కోసం ఒక భావోద్వేగపూరితమైన పాత్రను రూపొందించారు. తండ్రి–కుమార్తె మధ్య ఉన్న అనుబంధమే ఈ సినిమా ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.

Also Read:పార్లమెంట్ సమావేశాలు..అఖిలపక్ష సమావేశం

ఈ చిత్రంలో హీరోయిన్‌గా ప్రియ భవానీ శంకర్ నటిస్తుండగా, చిన్నారి బేబీ నక్షత్ర రవితేజ కుమార్తె పాత్రలో కనిపించనుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. సంగీత దర్శకుడిగా జి.వి. ప్రకాశ్ కుమార్ పనిచేస్తున్నారు.

- Advertisement -