ఈ జ్యోతి.. మరో స్వాతి

241
Jyothi Arrest in Nagaraju Assassination Case
- Advertisement -

మూడుముళ్ల బంధం మూన్నాళ్ల ముచ్చటగా మారుతోంది. దంపతుల్లో ఎవరో ఒకరు వేస్తున్న తప్పటడుగులు..పచ్చని సంసారాల్లో చిచ్చురేపుతోంది.  నిన్న స్వాతి,  నేడు జ్యోతి.. పేర్లు ఏవైనా వారు చేస్తున్న దారుణాలు మాత్రం ఒక్కటే. అక్రమ సంబంధాలకు అడ్డొస్తున్న భర్తలను అడ్డు తొలగిస్తున్నారు.

పాలమూరు జిల్లాకు చెందిన కార్పెంటర్ అయిన నాగరాజుకు, జ్యోతికి ఐదేండ్ల క్రితం వివాహమైంది. వీరికి బాబు, ఒక పాప ఉన్నారు. వివాహం అయినప్పటి నుంచి లాలాపేటలో నివాసముంటున్నారు. అయితే జ్యోతి నాచారంలో ఆరేండ్ల కింద తమ బంధువుల పెళ్లికి వెళ్లగా అక్కడ కార్తీక్ అనే యువకుడు పరిచయమయ్యాడు. మూడు, నాలుగు నెలల తర్వాత వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఈ విషయం జ్యోతి ఇంట్లో తెలియడంతో.. ఆమెను మందలించారు.

అయినా మారని జ్యోతి తన ప్రియుడిని రహస్యంగా కలుసుకుంటూ శారీరకసుఖం పొందుతూ వచ్చింది.  శాశ్వతంగా కార్తీక్‌తో ఉండాలని భావించిన జ్యోతి, ప్రియుడు, అతని స్నేహితుల సహకారంతో భర్తను చంపేసింది.

Jyothi Arrest in Nagaraju Assassination Case
డిసెంబర్‌ 31వ తేదీ రాత్రి కార్తీక్‌.. తన స్నేహితులు దీపక్‌, నరేశ్‌, యాసిన్‌తో కలిసి చౌటుప్పల్‌లో నాగరాజును హత్య చేశారు. నాగరాజుకు మత్తుమందు ఇచ్చిన అనంతరం ఊపిరాడకుండా చేసి చంపేశారు. ఆ తర్వాత శవాన్ని దగ్గర్లోని చెరువులో పడవేసి వెళ్లిపోయారు. ఈ హత్య విషయం నరేష్ అన్నకు తెలియడంతో పోలీసులకు దొరికిపోతామన్న భయం నరేష్‌ను వెంటాడింది. దీంతో 100కి డయాల్‌ చేసిన నరేష్‌.. జరిగిన దారుణాన్ని చెప్పాలనుకున్నాడు.

ఆ తర్వాత లాలాపేట పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోవడానికి వచ్చాడు. ధైర్యం సరిపోక లాలపేటకు వెళ్లి బ్లేడ్‌తో గొంతుకోసుకుని ఆత్మహత్యా యత్నం చేశాడు. గాంధీ ఆస్పత్రికి బాధితుడిని తరలించి చికిత్స అందించారు. విషయం తెలిసిన పోలీసులు ఆస్పత్రిలో నరేష్‌ను విచారించడంతో డొంకంతా కదలింది.

నాగరాజు హత్య కేసులో అతడి భార్య జ్యోతి, ప్రియుడు కార్తీక్‌, దీపక్, యాసీన్‌, నరేష్‌లను పోలీసులు అరెస్ట్‌ చేశారు. జ్యోతి, కార్తీక్‌, అతడి స్నేహితులు కలిసి పథకం ప్రకారం నాగరాజును హత్య చేశారని డీసీపీ రామచంద్రారెడ్డి తెలిపారు. నేరం చేసినట్టు నిందితులు అంగీకరించారని చెప్పారు.

అయితే మీడియా ముందు జ్యోతి, నాగరాజు భిన్నవాదనలు వినిపించారు. భర్తను చంపాలని తాను అనుకోలేదని జ్యోతి చెప్పగా, ఆమె ఒత్తిడి చేయడం వల్లే నాగరాజును చంపామని కార్తీక్ వెల్లడించాడు. ‘డిసెంబర్‌ 30న పదేపదే ఫోన్లు చేసి జ్యోతి రమ్మని పిలిచింది. పొద్దున నుంచి ఒకటే ఫోన్లు చేసింది. నాగరాజుకు నిద్రమాత్రలు వేసేశానని ఫోన్‌ చేయడంతో నా ఫ్రెండ్స్‌ను తీసుకుని వెళ్లాను. తర్వాత మేమంతా కలిసి అతడిని చంపేశాం. తర్వాత శవాన్ని అక్కడి నుంచి తీసుకెళ్లి దూరంగా పడేశామ’ని కార్తీక్‌ వివరించాడు. మొత్తంగా క్షణకాల సుఖం కోసం భర్త నాగరాజును కడతేర్చింది కసాయి జ్యోతి. చివరికి కటకటాల పాలైంది.

- Advertisement -