నెటిజన్‌ పై జ్వాల ఫైర్..

185
- Advertisement -

బ్యాడ్మింట‌న్ స్టార్ గుత్తా జ్వాలా ఓ నెటిజన్‌ పై ఫైర్‌ అయింది. సోషల్‌ మీడియాలో కోపంతో ఊగిపోయింది. అంతేనా..? మరోసారి ఇలాంటి కామెంట్ పెట్టావో…నాలోని మరో కోణాన్ని చూడాల్సివస్తది అంటూ ఘాటుగానే వ్యాఖ్యానించింది జ్వాల. అసలు గుత్తాజ్వాలాకి నెటిజన్‌ కి మధ్య ఏం జరిగింది?

 Jwala Gutta slams social media trolls for calling her 'anti-national ...

వివరాల్లోకి వెళితే… కొద్దిరోజుల క్రితం గుత్తా జ్వాలా ఓ వీడియోని ట్విట్టర్‌లో పోస్టు చేశారు. అందులో జ్వాలా తన సోదరితో కలిసి పాట పాడుతూ ఉండగా.. వారి తల్లి ఇన్సి గుత్తా కూడా వీడియోలో కనిపిస్తారు.

ఈ వీడియోని చూసిన ఓ నెటిజన్‌ ‘మీ తల్లి చైనా నుంచి వచ్చారు కనుకే… మీరు ఎల్లప్పుడూ ప్రధాని నరేంద్ర మోడీ పట్ల వ్యతిరేకత చూపిస్తున్నారు కదా’ అని ప్రశ్నించాడు. అంతేకాదు ఆ నెటిజన్‌ .. మీరు యాంటీ నేష‌న‌ల్‌, యాంటీ మోడీ అని ఆరోపించాడు. దీంతో గుత్తా జ్వాల‌, ఆ నెటిజన్‌ మ‌ధ్య ట్వీట్ల యుద్ధం న‌డిచింది.

గుత్తా జ్వాలా తీవ్ర ఆగ్రహంతో ‘ఏదైనా మాట్లాడే ముందు పలుమార్లు ఆలోచించుకో’ అని ఘాటుగా సమాధానం ఇచ్చారు. ‘నీపై ఉన్న గౌరవం పోయింది. ఇకపై నా నుంచి నీకు ఎలాంటి సమాధానం లభించదు. నువ్వు ఏదైనా అడగదలుచుకుంటే నేరుగా ప్రశ్నించు. మన మధ్య సంభాషణల్లో నా తల్లిదండ్రుల గురించి ప్రస్తావన తీసుకువస్తే.. నాలో మరో కోణం చూస్తావు. గుర్తుపెట్టుకో’ అని పేర్కొంది.

- Advertisement -