మాజీ మంత్రి జువ్వాడి కన్నుమూత…

599
juvvadi
- Advertisement -

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్ రావు ఇకలేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కరీనంగర్‌లోని ఓ ఆస్పత్రిలో ఇవాళ ఉదయం కన్నుమూశారు. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం తిమ్మాపూర్‌లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

తిమ్మాపూర్ సర్పంచిగా రాజకీయ ప్రస్ధానం ప్రారంభించిన జువ్వాడి అంచెలంచెలుగా ఎదిగి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేశారు.

1989లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి బుగ్గారం నుంచి తొలిసారి గెలుపొందారు. తర్వాత 1999, 2004లో బుగ్గారం ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2010 నుండి రాజకీయాలకు దూరమయ్యారు.

- Advertisement -