వరంగల్, కామారెడ్డి, సిరిసిల్లలో జూట్ మిల్లుల ఏర్పాటు

195
ktr
- Advertisement -

ముఖ్యమంత్రి కేసీఆర్ విధానాల వల్ల, సుభిక్ష పాలన, శాంతి భద్రతలు, 24 గంటల కరెంటు, మౌలిక సదుపాయాలతో తెలంగాణకు పరిశ్రమలు వెల్లువలా తరలివస్తున్నాయి. ఈరోజు దాదాపు 900 కోట్లతో వరంగల్ లో గ్లోస్టర్ లిమిటెడ్, కామారెడ్డిలో కాళేశ్వరం ఆగ్రో ప్రైవేట్ లిమిటెడ్, సిరిసిల్లలో ఎంబిజీ కమోడిటీస్ ప్రైవేట్ లిమిటెడ్లు ఏర్పాటు చేయబోయే జూట్ మిల్లుల వల్ల దాదాపు 11వేల తెలంగాణ నిరుధ్యోగ యువతకు పెద్ద ఎత్తున ప్రత్యక్షంగా ఉపాధి, వేలాది కుటుంబాలకు, రైతులకు పరోక్షంగా లబ్దీ చేకూరుతుంది.

ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి గంగుల..సుసంపన్న తెలంగాణలో పంటల దిగుబడి ఇబ్బడి, ముబ్బడిగా పెరిగింది, దీనికి అనుగుణంగా గన్నీ బ్యాగుల అవసరం గత ఏడేళ్లుగా 2014లో 24 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కోసం 3.2కోట్ల కొత్త గన్నీ బ్యాగుల అవసరం నుండి 2021-22లో 141 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కోసం 50 కోట్ల గన్నీల వరకూ పెరుగుతూ వస్తుంది. ప్రస్తుతం ప్రతీ పంట సీజన్లో దాదాపు 20కోట్లకు పైగా గన్నీబ్యాగుల అవసరాలకు ఈ సంవత్సరం దాదాపు 35.25 కోట్ల నూతన గన్నీలుగా ఉంది, కరోనా సంక్షోభంలో కేంద్ర గన్నీ కార్పోరేషన్ డబ్బులు కట్టినప్పటికీ మనకు సరిపడా గన్నీ బ్యాగులు అందించలేకపోయిందన్నారు.

FCI గైడ్ లైన్స్ ప్రకారం 54 శాతం కొత్త గన్నీలు వాడాల్సిన అవసరం ఉంది ఇందులో సింహాబాగం వెస్ట్ బెంగాల్, ఛత్తీస్గడ్, ఏపీల నుండే 49.26 నుండి 61.78 రూపాయలతో ఒక్కో గన్నీ బ్యాగుని సేకరిస్తున్నాం, ట్రాన్స్ పోర్ట్ కోసం రూపాయలు 2.36 నుండి 67పైసల వరకూ ఖర్చు చేస్తున్నాం, కొత్త జూట్ మిల్లుల ద్వారా సమయంతో పాటు నిధులు ఖర్చు సైతం తగ్గుతుంది. ఇవి ఉత్పత్తి చేసే 5కోట్ల గన్నీ బ్యాగులు మనకే కేటాయించాలి, మరిన్ని సంస్థలు ఈ రంగంలో రాబోతున్నాయి, ధాన్యం సేకరణకు అవసరమైన గన్నీ బ్యాగుల కొరత తీరి స్వయం సమ్రుద్ది సాదిస్తాం. గన్నీలతో పాటు కూరగాయల బ్యాగులు, చేసంచులు ఇతర ఉత్పత్తుల వల్ల మితిమీరిన ప్లాస్టిక్ వినియోగాన్ని సైతం అరికట్టి పర్యావరణానికి ఎంతో దోహదపడుతుంది, జనపనారా పంటలకు ప్రోత్సాహం దొరికి రైతులకు సైతం ప్రత్యామ్నాయ పంటలు పండించి లాబాలు గడించే అవకాశం ఏర్పడుతుంది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మార్గదర్శనంలో డైనమిక్ ఇండస్ట్రీస్ మినిస్టర్ కేటీఆర్ గారు కలిగించిన నమ్మకంతోనే తెలంగాణ అత్యంత వేగంగా పురోగమనిస్తుంది, ఇది మన అదృష్టం అన్నారు.

- Advertisement -