కోచ్ పదవికి రాజీనామా చేసిన లాంగర్‌..

69
ca
- Advertisement -

ఆసీస్ కోచ్ పదవికి రాజీనామా చేశారు జస్టిన్ లాంగర్. ఆయన తీసుకున్న షాకింగ్ నిర్ణయంతో అంతా షాక్‌కు గురయ్యారు. కొంద‌రు ఆట‌గాళ్ల‌తో పాటు గ‌వ‌ర్నింగ్ బోర్డులోని కొంద‌రు స‌భ్యుల‌తో విబేధాలు వ‌చ్చిన నేప‌థ్యంలో లాంగ‌ర్ ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది.

లాంగ‌ర్ భ‌విష్య‌త్తు గురించి క్రికెట్ ఆస్ట్రేలియా బోర్డు స‌భ్యులు సుదీర్ఘంగా చ‌ర్చించినా.. మాజీ ఓపెన‌ర్ మాత్రం కోచ్ ప‌ద‌విని వ‌దులుకున్నారు. ట్రాక్ రికార్డ్ బాగున్నా.. షార్ట్ ట‌ర్మ్ కాంట్రాక్ట్ ఇవ్వ‌డం వ‌ల్ల లాంగ‌ర్ అసంతృప్తికి గురైనట్లు తెలుస్తోంది.

ఇటీవ‌ల లాంగ‌ర్ శిక్ష‌ణ‌లోనే ఆస్ట్రేలియా టాప్ ఫామ్‌ను క‌న‌బ‌రిచింది. ఇంగ్లండ్‌తో జ‌రిగిన యాషెస్ సిరీస్‌తో పాటు టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌ను కూడా గెలిచింది.

- Advertisement -