నామినేషన్ వేసిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి

11
- Advertisement -

ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు జస్టిస్ సుదర్శన్ రెడ్డి. ఈ నామినేషన్ కార్యక్రమంలో మల్లిఖార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్ పోటీ చేస్తుండగా ఆయన ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు.

ఉపరాష్ట్ర పతి ఎన్నిక నామినేషన్లకు నేడే చివరి తేది. 22న నామినేషన్ల పరిశీలన, 25 వరకు ఉపసంహరణ ఉండనుంది. జగదీప్ ధన్ఖడ్ రాజీనామాతో ఉపరాష్ట్రపతి పదవికి ఉప ఎన్నిక అనివార్యమైంది.

Also Read:BB9 Telugu:హౌస్ రెండు భాగాలుగా!

అనారోగ్య కారణాలతో జూలై 21న రాజీనామా చేశారు జగదీప్ ధన్‌ఖడ్.

- Advertisement -