సుప్రీంకోర్టు నూతన సీజేఐ గా శరత్ అరవింద్ బాబ్డే

469
bobde
- Advertisement -

సుప్రీంకోర్టు కొత్త చీఫ్ జస్టీస్‌గా జస్టిస్ శరద్ అరవింద్ బాబ్డేను నియమిస్తు ఉత్తర్వులు జారీ చేశారు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్. వేశారు. జస్టిస్ బాబ్డే నవంబర్‌ 18న ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌గా ప్రస్తుతం బాధ్యతలు నిర్వహిస్తోన్న రంజన్ గొగోయ్ నవంబర్ 17వ తేదీన పదవీ విరమణ చేయనున్నారు.

సుప్రీంకోర్టు 47వ ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)గా జస్టిస్‌ శరద్‌ అరవింద్‌ బాబ్డేను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్.. నియమించారు. మహారాష్ట్రకు చెందిన శరద్‌ అరవింద్‌ బాబ్డే 1956 ఏప్రిల్‌ 24న నాగపూర్‌కు చెందిన న్యాయవాద కుటుంబంలో జన్మించారు. నాగ్‌పూర్‌ వర్సిటీకి చెందిన ఎస్‌ఎఫ్‌ఎస్‌ కాలేజీలో న్యాయవిద్య అభ్యసించారు. 2012లో మధ్యప్రదేశ్‌ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌గా బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు.

- Advertisement -