జస్టిస్ కర్ణన్.. రిటైర్మెంట్ కూడా రికార్డే..!

220
Justice CS Karnan retires from Calcutta HC
- Advertisement -

భారత న్యాయ చరిత్రలో కోల్‌కతా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కర్ణన్ నిలిచిపోతాడనంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తులకే శిక్షను విధించి, ఆపై పోలీసుల అరెస్టును తప్పించుకునేందుకు మాయమైన కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీఎస్ కర్ణన్, పదవీ విరమణ రోజు కూడా కనిపించకుండా పోయారు. సుప్రీంకోర్టు ఆరు నెలల జైలు శిక్షను విధించిన తరువాత కనిపించకుండాపోయిన ఆయన.. అజ్ఞాతంలోనే వుండి పదవీ విరమణ చేసిన మొట్టమొదటి న్యాయమూర్తిగా రికార్డుల్లోకి ఎక్కారు.

ఈ ఉదయంతో ఆయన పదవీకాలం పూర్తి అయింది. ఆయన చెన్నైలో ఉన్నారని, శ్రీకాళహస్తి ప్రాంతంలో తిరిగారని వార్తలు వచ్చినప్పటికీ, ఇంతవరకూ ఆయన ఎక్కడున్నాడన్న విషయాన్ని పోలీసులు కూడా గుర్తించలేకపోయారు.

ఈ ఏడాది జనవరిలో సుప్రీంకోర్టు, హైకోర్టు సిట్టింగ్‌ మరియు రిటైర్డ్‌ జడ్జీల్లో 20మంది అవినీతికి పాల్పడ్డారని సంచలన ఆరోపణలు చేయడంతో కర్ణన్ వార్తల్లో నిలిచాడు.చీఫ్‌ జస్టిస్‌తో సహా ఏడుగురు జడ్జిలకు జస్టిస్‌ కర్ణన్‌ ఐదేళ్ల శిక్ష విధిస్తూ సంచలన ప్రకటన చేశారు.ఇలా ఒక హైకోర్టు జడ్జీ కోర్టు ధిక్కారం కింద సుప్రీంకోర్టు ఎదుట హాజరుకావడం భారత న్యాయవ్యవస్థ చరిత్రలోఇదే మొదటిసారి కాగా.. చీఫ్‌ జస్టిస్‌తోసహా ఆరుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు తనముందు హాజరుకావాలని హైకోర్టు జడ్జీ నోటీసులు ఇవ్వడం కూడా భారత న్యాయవ్యవస్థలో ప్రథమం.  2011లో తోటీ జడ్జీలు తనపై కుల వివక్ష చూపిస్తున్నారంటూ ఎస్సీ కమీషన్ ఆశ్రయించిన తొలి జడ్జీ కూడా కర్ణణే.

ఒక హైకోర్టుకు జడ్జిగా ఉండి.. వింతగా ప్రవర్తించడంతో కోర్టు ధిక్కారం కేసులో దోషిగా తేల్చిన సుప్రీంకోర్టు ధర్మాసనం జస్టిస్ కర్ణన్‌కు ఆరు నెలల పాటు జైలు శిక్ష విధించింది. ఈ మేరకు ఆయనను అరెస్టు చేసి జైలుకు తరలించాల్సిందిగా మే 9న తీర్పు వెలువరించింది. అంతకు ముందే చెన్నై వచ్చిన ఆయన… తీర్పు వచ్చిన రోజే తన వ్యక్తిగత సిబ్బందికి కూడా సమాచారం ఇవ్వకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. పదవీ కాలంలో జైలు శిక్ష పడిన ఏకైక న్యాయమూర్తి కూడా ఆయనే కావడం విశేషం. మరోవైపు సుప్రీం కోర్టు ఆదేశాలను అమలు చేయడం కోసం… డీజీపీ ర్యాంకు అధికారి నేతృత్వంలోని పశ్చిమ బెంగాల్ పోలీసు బృందం మే 10 నుంచి చెన్నైలోనే మకాం వేసింది. ఇంతవరకు ఆయన ఆచూకి తెలియకపోవడం విస్మయానికి గురి చేస్తోంది.

- Advertisement -