- Advertisement -
52వ సీజేఐగా జస్టిస్ గవాయ్ తో ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ముర్ము… గవాయ్‌తో రాష్ట్రపతి భవనంలో పదవీ ప్రమాణం చేయించారు.ఈ ఏడాది నవంబర్ 23 వరకు సీజేఐగా కొనసాగనున్నారు గవాయ్.
జస్టిస్ గవాయి, దేశ అత్యున్నత న్యాయస్థాన పదవిని అలంకరించిన తొలి బౌద్ధుడు, మరియు దళిత సముదాయానికి చెందిన రెండవ వ్యక్తిగా నిలిచారు.మే 13న పదవీ విరమణ చేసిన సీజీఐ సంజీవ్ ఖన్నా స్థానంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు.
1960 నవంబర్ 24న మహారాష్ట్రలోని అమరావతిలో జన్మించిన జస్టిస్ గవాయి అంబేద్కర్ సిద్ధాంతాలకు కట్టుబడిన కుటుంబానికి చెందినవారు. ఆయన తండ్రి ఆర్.ఎస్. గవాయి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ప్రముఖ నేతగా. అలాగే బీహార్, సిక్కిం, కేరళ రాష్ట్రాల గవర్నర్‌గా సేవలందించారు.
Also Read:మీరు వాడే మెడిసిన్స్ నిజమైనవేనా?
- Advertisement -

