తెలంగాణ సీజేగా అలోక్ అరదే

41
- Advertisement -

తెలంగాణ కొత్త జస్టీస్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు అలోక్ అరదే. ప్ర‌స్తుత తెలంగాణ హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఉజ్జ‌ల్ భూయాన్‌కు సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తిగా ప‌దోన్న‌తి క‌ల్పిస్తూ కొలీజియం సిఫార్సు చేసిన నేపథ్యంలో రాష్ట్ర హైకోర్టుకు కొత్త సీజేను సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది.

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌కు చెందిన జ‌స్టిస్ అలోక్ అర‌దే 2009లో హైకోర్టు జ‌డ్జిగా నియ‌మితుల‌య్యారు. 2018 న‌వంబ‌ర్ నుంచి క‌ర్ణాట‌క హైకోర్టు న్యాయ‌మూర్తిగా కొన‌సాగుతున్నారు. సీనియారిటీని పరిగణలోకి తీసుకుని అలోక్‌ని సిఫార్సు చేయగా ఆయన త్వరలో తెలంగాణ జస్టిస్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు.

Also Read:Salaar:ఊరమాస్ టీజర్
ప్రస్తుతం తెలంగాణ, కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా కొన‌సాగుతున్న‌ జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌, జస్టిస్‌ ఎస్‌ వెంకటనారాయణ భట్టిని సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పిస్తూ కొలీజియం సిఫార్సు చేసిన సంగ‌తి తెలిసిందే.

- Advertisement -