జురాలకు కొనసాగుతున్న వరద…

189
jurala
- Advertisement -

ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు భారీగా వరదనీరు చేరుతోంది. జురాల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వసామర్థ్యం 1045 అడుగులు (9.657 టీఎంసీలు) ప్రస్తుతం 1044 అడుగులు (8.730 టీఎంసీలు)గా ఉంది. ఇప్పటికే ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండటం.. దాదాపు 4.06 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండటంతో అధికారులు ప్రాజెక్టు 43 గేట్లను ఎత్తి 4,17,770 క్యూసెక్కులను దిగువకు విడుదల చేశారు.

- Advertisement -