ఇవి తింటే లివర్.. మటాష్ !

25
- Advertisement -

లివర్ అనేది మన శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవం. రక్తాన్ని ఎప్పటికప్పుడు శుద్ధి చేయడమే లివర్ యొక్క పని. ఒకవేళ లివర్ చెడిపోతే శరీరంలోని అన్ని అవయవాల పనితీరు బ్యాలెన్స్ తప్పుతుంది. ఫలితంగా ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకే లివర్ అనేది మన శరీరంలో ఎంతో కీలకం. కొన్ని అలవాట్ల కారణంగా లివర్ ను చేజేతులా నాశనం చేసుకుంటున్నారు చాలమంది. ముఖ్యంగా ధూమపానం, మద్యపానం వంటి అలవాట్ల లివర్ ఆరోగ్యం దెబ్బ తింటుంది. కాబట్టి వీటికి దూరంగా ఉండాలని వైద్య నిపుణులు తరచూ చెబుతూనే ఉంటారు. అయితే కేవలం ధూమపానం, మద్యపానం.. వంటి అలవాట్ల కారణంగానే కాకుండా మనం తినే ఆహారం ద్వారా కూడా లివర్ పనితీరు మందగిస్తుందట. .

ముఖ్యంగా జంక్ ఫుడ్స్, ఆయిల్ ఫుడ్స్, అధిక మాంసాహారం, కొలెస్ట్రాల్ శాతం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు.. ఇవన్నీ కూడా లివర్ ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. జంక్ ఫుడ్స్ లో పోషకాలు తక్కువ కొవ్వు శాతం ఎక్కువ ఉంటుంది. ఇదంతా కూడా శరీరంలో వ్యర్థమైన కొవ్వుగా పేరుకుపోయి, లివర్ పై ప్రభావం చూపిస్తుంది. ఇంకా ఆయిల్ ఫుడ్స్ ఎక్కువగా తింటే కూడా లివర్ పై చెడు కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం ఉంది. అది కూడా ఏ మాత్రం మంచిది కాదు. ఇక కొంతమంది మాంసప్రియులు ప్రతిరోజూ నాన్ వెజ్ తింటూ ఉంటారు. ఇలా ప్రతిరోజూ నాన్ వెజ్ తినడం వల్ల కూడా లివర్ పనితీరు మందగిస్తుంది. మాంసాహారంలో ప్రోటీన్ శాతం అధికంగా ఉంటుంది. అలాగే కొలెస్ట్రాల్ శాతం కూడా ఎక్కువే. ఇవి ఎక్కువైతే లివర్ పై ప్రతికూల ప్రభావం చూపిస్తాయి. కాబట్టి లివర్ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తినే ఆహారం విషయంలో కూడా జాగ్రత్త వహించాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Also Read:సిల్వర్ స్క్రీన్ పైకి మహేష్ కూతురు

- Advertisement -