మీరే మా అస్తిత్వం:జూనియర్ ఎన్టీఆర్

571
ntr
- Advertisement -

సినీనటుడు,టీడీపీ నేత నందమూరి హరికృష్ణ 66వ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా నందమూరి అభిమానులతో పాటు టీడీపీ శ్రేణులు హరికృష్ణకు ఘనంగా నివాళి అర్పించారు. జూనియర్ ఎన్టీఆర్,కల్యాణ్ రామ్,ఏపీ మాజీ సీఎం చంద్రబాబు,నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా హరికృష్ణ సేవలను గుర్తు చేసుకున్నారు.

మొక్కవోని ధైర్యంతో కొనసాగే మా ఈ ప్రస్థానానికి నేతృత్వం మీరు,ఆజన్మాంతం తలుచుకునే అశ్రుకణం మీరు అంటూ ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు ఎన్టీఆర్. ఈ అస్తిత్వం మీరు…ఈ వ్యక్తిత్వం మీరు అంటూ తెలిపారు ఎన్టీఆర్.

టీడీపీకి,ప్రజలకు హరికృష్ణ చేసిన సేవలు మర్చిపోలేమన్నారు చంద్రబాబు. హరికృష్ణ జయంతి సందర్భంగా ఆయనకి నివాళి అర్పిస్తున్నానని చెప్పారు. అరుదైన వ్యక్తిత్వం,అలు పెరగని పోరాటతత్వం హరికృష్ణ సొంతమని ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు లోకేష్. మీరు మా మధ్య లేకపోయినా మీ జ్ఞాపకాలు ఎప్పుడు మాతోనే ఉంటాయన్నారు.

- Advertisement -