విద్యుత్ శాఖలో జూనియర్ లైన్‌మెన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 1201 విద్యుత్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కాగా ఇందులో
వెయ్యి జూనియర్ లైన్‌మెన్, 201 సబ్ ఇంజినీర్ పోస్టులున్నాయి.
జూనియర్ లైన్‌మెన్ పోస్టులకు ఈ నెల 19 నుంచి దరఖాస్తులు స్వీకరించనుండగా, జూన్ 17న రాత పరీక్ష నిర్వహిస్తారు. సబ్ ఇంజినీర్ పోస్టులకు జూన్ 15 నుంచి దరఖాస్తులు స్వీకరించి, జూలై 31న రాత పరీక్ష నిర్వహిస్తారు. దరఖాస్తుదారులు రూ. 200 ఆన్‌లైన్ అప్లికేషన్ ఫీజు, రూ.120 పరీక్ష ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు పరీక్ష ఫీజు మినహాయించారు. వీరు ఆన్‌లైన్ అప్లికేషన్ ఫీజు చెల్లిస్తే సరిపోతుంది.
ఎస్సెస్సీతోపాటు ఐటీఐలో ఎలక్ట్రికల్ ట్రేడ్, వైర్‌మెన్ లేదా ఎలక్ట్రికల్ ట్రేడ్ లో ఇంటర్ ఒకేషనల్ కోర్సు పాసై ఉండాలి. 2022 జనవరి 1 నాటికి 18 నుంచి 35 ఏండ్ల లోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వారికి ఐదేండ్ల వయోపరిమితి సడలింపు ఉంటుంది.