అందాలను చూపి…18 లక్షలు కొట్టేసింది..

174
- Advertisement -

సినిమా ఓ రంగుల ప్రపంచం… ఈ రంగుల ప్రపచంలో.. నటీమణులు అప్పుడే ఆకాశంలో మెరిసే నక్షత్రాల్లాగా మెరుస్తారు.. అంతలోనే అఃధపాతాళానికి పడిపోతారు. ఈ సినిమా అనే రంగుల లోకంలో చిత్ర విచిత్రాలు చాలానే ఉంటాయన్నది జగమెరిగిన సత్యమే… కాలానుగుణంగా వస్తున్న మార్పులతో పాటే చిత్ర పరిశ్రమలో ఎన్నో సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. అయితే ఇతర రంగాలతో పోలిస్తే.. సినిమా పరిశ్రమపై ప్రతి ఒక్కరి దృష్టి ఉండడంతో ఈ విషయాలన్ని తొందరగా బయటికి వచ్చి… ఆసక్తిని రేకిస్తూ చర్చనీయాంశంగా మారుతాయి. సినిమా పరిశ్రమలో ఏ చిన్న సంఘటన జరిగినా అదో ఆసక్తికరమైన వార్తగా జనాలు స్పందిస్తారు.

ఇక సినిమా హీరో హీరోయిన్ల గురించి అయితే వేరేగా చెప్పనక్కర్లేదు. నిజానికి సినిమా ఇండస్ట్రీలో ప్రేమాయణాలు.. రిలేషన్‌ షిప్‌ లు ఎక్కువే అయినప్పటికీ…ఈ మధ్య ఇవి మితిమీరిపోతున్నాయనే చెప్పాలి. పరిచయం, ప్రేమ, పెళ్లి అంటూ… కొందరు తమ అందాలను ఎరవేస్తూ… నిలువునా ముంచిపోతున్న ఘటనలు ఈ మధ్య కాలంలో కాస్త ఎక్కువగా కనిపిస్తున్నాయనే చెప్పాలి. తాజాగా ఇటువంటి ఘటనే తెలుగు చిత్ర పరిశ్రమలో జరిగింది. రీసెంట్ గా ఒక నటుడు ఇలాగే లైంగిక వాంఛలు తీర్చుకోవడం కోసం ఒక నెరజాణ చేతిలో మోసపోయినట్లు తెలుస్తోంది. మోసం చేసింది కూడా ఒక జూనియర్ ఆర్టిస్టు అని అంటున్నారు. ఆ అమ్మాయి.. తన విసాలవంతమైన జీవితం కోసం తన అందాలను ఎరవేస్తూ… అబ్బాయిలను బుట్టలో పడేస్తూ… అందినకాడికి దండుకొంది. ఫొటోలు, వీడియోలు ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్‌ చేసి… చాటింగ్‌ పేరిట.. పరిచయమై.. ప్రేమ పెళ్లి అంటూ.. నమ్మిస్తోంది. ఆ అమ్మాయి వలలో పడిన నటుడు ఏకంగా 18 లక్షలు పోగొట్టుకున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -