జూన్ 2వ తేదిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవతం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్‌లో నిర్వహించే వేడుకల్లో ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ మహేందర్‌రెడ్డి పాల్గొంటారు. ఈసందర్భంగా రాష్ట్ర అవతరణ వేడుకల్లో పాల్గోని పతాకావిష్కరన చేసేవారి పేర్లను ఖారారు చేవారు ముఖ్యమంత్రి కేసీఆర్.
సిద్దిపేటలో స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, రంగారెడ్డి జిల్లాకేంద్రంలో డిప్యూటీ స్పీకర్ పద్మారావు, వరంగల్ రూరల్ – ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, రాజన్న సిరిసిల్ల – ప్రభుత్వ సలహాదారు జి.ఆర్.రెడ్డి, నిజామాబాద్ – మంత్రి ప్రశాంత్‌రెడ్డి, నిర్మల్ – మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, సంగారెడ్డి – మంత్రి మహమూద్‌అలీ, సూర్యాపేట-మంత్రి జగదీశ్‌రెడ్డి, వనపర్తి – మంత్రి నిరంజన్‌రెడ్డి, వరంగల్ అర్బన్ – మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, పెద్దపల్లి – కరీంనగర్ జెడ్పీ చైర్మన్ తుల ఉమ, వికారాబాద్- రంగారెడ్డి జెడ్పీ చైర్మన్ సునీత