ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ తో జగన్ భేటీ

221
ys-jagan-with-kcr

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటీ అయ్యారు వైయస్సాసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి. వైసిపి ఎమ్మెల్యేలతో ప్రగతి భవన్ కు చేరుకున్న జగన్ కు సీఎం కేసీఆర్ ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, మంత్రులు జగన్‌కు ఘనస్వాగతం పలికారు. ఈనెల 30న తన ప్రమాణస్వీకారానికి హాజరుకావాలని కేసీఆర్‌ను జగన్‌ ఆహ్వానించారు.

Jagan Governer

  అంతకుముందు గవర్నర్ తో భేటీ అయ్యారు జగన్. వైఎస్‌ జగన్‌ నేతృత్వంలోని ఎమ్మెల్యేల ప్రతినిధి బృందం వైఎస్‌ఆర్‌సీపీ ఎల్పీ తీర్మాన ప్రతిని గవర్నర్‌కు అందజేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం ఏర్పాటుకు తమను ఆహ్వానించాల్సిందిగా నరసింహన్‌కు విజ్ఞప్తి చేస్తారు.