ఆదిత్య క్రియేషన్స్ పతాకంపై ఆదిత్య, రిచా నాయకానాయికలుగా భాస్కర్ బంటుపల్లి దర్శకత్వంలో లక్ష్మి నిర్మాతగా రూపొందుతోన్న చిత్రం `జూన్ 1:43` . ఇటీవలే రిలీజ్ చేసిన టీజర్‌కి చక్కని స్పందన వచ్చింది. త్వరలోనే సాంగ్ ప్రమోల్ని లాంచ్ చేయనున్నారు. ప్రస్తుతం సినిమా నిర్మాణానంతర పనులు పూర్తి చేసుకుంది. జూన్‌లో సినిమాని రిలీజ్ చేయనున్నామని దర్శకనిర్మాత తెలిపారు.
నిర్మాత లక్ష్మి మాట్లాడుతూ-“దర్శకుడు భాస్కర్ చెప్పిన కథ ఆసక్తి రేకెత్తించింది. అందుకే వెంటనే ప్రారంభించి, ప్రణాళిక ప్రకారం శ్రమించి టీం సపోర్ట్‌తో సినిమాను పూర్తి చేశాం. మల్హర్‌భట్ జోషి సినిమాను మంచి విజువల్స్‌తో పిక్చరైజ్ చేశారు. సినిమా చాలా బాగా వచ్చింది. దర్శకుడు భాస్కర్ బంటుపల్లి సినిమాను చక్కగా తెరకెక్కించారు. శ్రవణ్ సంగీతం సినిమాకే హైలైట్. ఆర్ట్ డిపార్ట్‌మెంట్ సహా నటీనటులు, టెక్నిషియన్స్ ఎంతో సపోర్ట్‌చేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పూర్తయింది. జూన్‌లో సినిమాని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం“ అన్నారు.
దర్శకుడు మాట్లాడుతూ -“నేను వినిపించిన కథ నిర్మాతకు నచ్చి వెంటనే ఓకే చెప్పారు. వైవిధ్యం ఉన్న ఇంట్రెస్టింగ్ కాన్సెప్టుతో సినిమాని తెరకెక్కించాను. నటీనటులు, టెక్నిషియన్స్ అందరం ఎంతో శ్రమించి చేసిన చిత్రమిది. ముఖ్యంగా శ్రవణ్ సంగీతం సినిమాకి ప్రాణం పోసింది. రీరికార్డింగ్ మైమరిపిస్తుంది. టీమ్ సపోర్ట్‌తో ఈ సినిమా పాజిబుల్ అయ్యింది. ఇక టైటిల్‌కు తగినట్టుగానే జూన్‌లోనే సినిమా విడుదల చేయనున్నారు“ అన్నారు.
ఆదిత్య, రిచా, వేణు, సాయి, బన్ను, కాశీవిశ్వనాథ్, మధుమణి, తోటపల్లి మధు, కేధార్ శంకర్ తదితరులు నటించిన ఈ చిత్రానికి ఎడిటర్ః ఎస్.బి.ఉద్ధవ్, కెమెరాః మల్హర్ భట్ జోషి, మ్యూజిక్ః శ్రవణ్, నిర్మాతః లక్ష్మి, రచన, దర్శకత్వంః భాస్కర్ బంటు పల్లి.