చర్మాన్ని మెరిపించే జ్యూస్ లు..!

70
- Advertisement -

అందరికంటే తామే అందంగా కనపడాలని మహిళలు చేసే ప్రయత్నాలు అన్నీ ఇన్ని కావు. మార్కెట్ లో దొరికే ఎన్నో రకాల క్రీమ్ లు, పౌడర్లు, ఫేస్ ప్యాక్స్.. ఇలా ఏది పడితే అది మొఖానికి రాసుకుంటూ ఉంటారు. ఇంకా కొందరు అందంగా కనిపించేందుకు మెడిసిన్స్ కూడా ఉపయోగిస్తూ ఉంటారు. ఇలా అందం కోసం కృత్రిమంగా తయారు చేసినవి, రసాయనాలకు సంబంధించినవి వాడడం వల్ల అందం పెరగడం సంగతి అటుంచి, లేని అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటూ ఉంటారు. .

కాబట్టి అందం విషయంలో మొఖానికి ఏవేవో క్రీమ్స్ రాయడం కన్నా.. సహజసిద్దంగా మనం తినే ఆహార డైట్ ను ప్రాపర్ గా ఫాలో అయితే చర్మం నిగారింపు సొంతం చేసుకొని ఎంతో అందంగా కనిపిస్తారని నిపుణులు చెబుతున్నారు. మనం ప్రతిరోజూ తినగలిగిన ఆహార పదార్థాలు అయిన క్యారెట్, కీరదోస, టమోటో వంటివి చర్మ సౌందర్యాన్ని పెంచడంలో ఎంతో ఉపయోగ పడతాయట. ఇందులో ఉండే జింక్, మెగ్నీషియం, ఫాస్ఫరస్ వంటివి చర్మానికి నిగారింపును తీసుకొస్తాయి.

ఇవే కాకుండా బీట్ రూట్, పాలకూర, వంటివి కూడా చర్మ సౌందర్యాన్ని పెంచుతాయట. ఇందులో ఉండే ఫోలిక్ యాసిడ్, విటమిన్ సి, ఐరన్ వంటివి చర్మం లోపలి పొరలో ఉండే మలినాలను తొలగించి చర్మ నిగారింపుకు సహాయ పడతాయి. కాబట్టి వీటిని ప్రతిరోజూ జ్యూస్ రూపంలో ఉదయం సాయంత్రం తీసుకుంటే ఎంతో మేలట. క్యారెట్, బీట్ రూట్, కీర దోస,.. వంటిని మిక్స్ గా చేసి జ్యూస్ తయారు చేసుకొని తాగాలి లేదా విడివిడిగా వీటన్నిటిని విడివిడిగా జ్యూస్ చేసుకొని తగిన మంచి ఫలితాలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి చర్మ సౌందర్యం కోసం ఏవేవే క్రీజులు వాడి లేని సమస్యలను కొని తెచ్చుకోవడం కన్నా సహజసిద్దంగా లభించే వీటి ద్వారా అందాన్ని పెంచుకోవచ్చు.

గమనిక : ఈ వార్తాను ఇంటర్నెట్ లోని సమాచారం ద్వారా అందించడం జరిగింది. కాబట్టి ఫాలో అయ్యే ముందు నిపుణులను సంప్రదించి వారి సలహా తీసుకోవడం మంచిది.

Also Read:Ponnam:బీజేపీకి ఓటుతో బుద్ది చెప్పండి

- Advertisement -