చంద్రబాబుకు బెయిలా? జైలా అనే ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఇరు వర్గాల వాదనలు సుదీర్ఘంగా విన్న సీఐడీ న్యాయమూర్తి తీర్పను రిజర్వ్‌లో ఉంచారు. చంద్రబాబు తరపున సిద్ధార్థ్ వాదనలు వినిపించగా సీఐడీ తరపున పి సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. ఇక ఎఫ్‌ఐఆర్‌లో తొలుత చంద్రబాబు పేరును ఎందుకు చేర్చలేదని తెలిపింది. ఇక చంద్రబాబు స్వయంగా తన వాదనలు వినిపించారు. తాను ఏ తప్పు చేయలేదని రాజకీయ కక్షతోనే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. చంద్రబాబు లాయర్ తరపు న్యాయవాది సైతం ఇదే అంశాన్ని ప్రస్తావించారు.
చంద్రబాబు నాయుడ్నిఅర్ధరాత్రి 1 గంటకి అరెస్ట్ చేసి…24 గంటలు దాటిన తర్వాత కోర్టులో ప్రవేశపెట్టారంటూ ఆయన తరఫున లాయర్లు వేసిన మెమోను కోర్టు తిరస్కరించింది. స్కిల్ డెవలప్‌మెంట్‌కు 2015-16 బడ్జెట్‌లో పొందుపర్చా, దీనికి రాష్ట్ర అసెంబ్లీ కూడా ఆమోదించింది. అసెంబ్లీ ఆమోదించిన బడ్జెట్ కేటాయింపులను క్రిమినల్ చర్యలతో ప్రశ్నించలేరు.2021 డిసెంబర్ 9న నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో కాని.. రిమాండ్ రిపోర్టులో కూడా నా పాత్ర ఉందని ఎక్కడా సీఐడీ పేర్కొనలేదని చంద్రబాబు వాదించారు.
అయితే కోర్టు ఏం నిర్ణయం తీసుకుంటుందోనని అంతా ఆసక్తిగా ఎదరుచూస్తున్నారు.
Also Read:సమంత మెచ్చిన..’మిస్ శెట్టి’

