లాలూకు మరోసారి ఝలక్

197
Judge promises Lalu Chura-Dahi in jail on Makar Sankranti
- Advertisement -

దాణా కుంభకోణం కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్‌ యాదవ్‌కి సీబీఐ న్యాయమూర్తి మరో షాకిచ్చారు. ఈ కేసులో లాలూకు మూడున్నరేళ్ల జైలు శిక్ష పడగా ప్రస్తుతం ఝార్ఖండ్‌లోని హజరిబాగ్‌ ప్రాంతంలో ఉన్న ఓపెన్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. ఈ నేపథ్యంలో లాలూను కలవడానికి వారానికి కేవలం ముగ్గురికి మాత్రమే అనుమతిస్తున్నారు. ఈ నేపథ్యంలో విజిటర్స్ సంఖ్యను పెంచాలని లాలూ పెట్టుకున్న అభ్యర్థనను శివపాల్ సింగ్ తొసిపుచ్చారు.

దీంతో పాటు సంక్రాంతి పండుగ వస్తోంది..మా ఇంట్లో దహీ చుర్రా (స్వీట్‌)తో చాలా అట్టహాసంగా పండుగ జరుపుకుంటాం. నన్ను కలవడానికి వారంలో కేవలం ముగ్గురికే అనుమతిస్తున్నారు. ఈ విషయం గురించి మరోసారి ఆలోచించండని న్యాయమూర్తిని కోరగా ఆ దహీ చుర్రా నీకు అందేలా చూస్తాను. కానీ ముగ్గురు విజిటర్లకు మించి లోనికి అనుమతించేది లేదని స్పష్టం చేశారు.

ఇంతకుముందు కూడా లాలూ తనకు జైల్లో చలిగా ఉందని చెప్పడంతో న్యాయమూర్తి ‘చలేస్తే తబలా వాయించుకో’ అంటూ చురకలంటించిన విషయం తెలిసిందే. ఇక దాణా కుంభకోణంలో లాలూ జైలుకు వెళ్లడం ఇది ఎనిమిదో సారి.

- Advertisement -