ఎన్టీఆర్ కు డైరెక్టర్ దొరికాడు..

268
NTR-Babi
- Advertisement -

జనతా గ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్ నెక్ట్స్ సినిమా ఏంటీ. ఈ ప్రశ్నకు సమాధానం కోసం గత నాలుగు నెలలుగా ఎన్టీఆర్ అభిమానులతో పాటు..టాలీవుడ్‌ సినీ జనాలు కూడా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ సస్పెన్స్‌కు పుల్ స్టాప్ పెడుతూ..తారక్ తన నెక్ట్స్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. దాదాపు పది దర్శకులను చుట్టేసిన ఎన్టీఆర్ నెక్ట్స్ సినిమాకు డైరెక్ట‌ర్, ప్రొడ్యుస‌ర్ ఫిక్స‌య్యార‌ని, అఫీషియ‌ల్ ఎనౌన్స్‌మెంట్ రావ‌డ‌మే త‌రువాయి అని తెలుస్తోంది.

ntr

ఈ ఏడాది స‌మ్మ‌ర్‌లో స‌ర్దార్ – గ‌బ్బ‌ర్‌సింగ్‌తో ఫ్లాప్ ఇచ్చినా బాబీ క‌థ న‌చ్చ‌డంతో ఎన్టీఆర్ ఆ క‌థ‌కు ఓకే చెప్పిన‌ట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు ముందు దిల్ రాజు నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తాడ‌ని వార్త‌లు వ‌చ్చినా ఎన్టీఆర్ మాత్రం త‌న సోద‌రుడు క‌ళ్యాణ్‌రామ్ సొంత బ్యాన‌ర్ అయిన ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌లోనే ఈ సినిమా చేసేందుకు ఓకే చెప్పాడ‌ట‌. ఈ నెల‌లో లాంఛ‌నంగా ప్రారంభ‌మ‌య్యే ఈ సినిమా వ‌చ్చే యేడాది జ‌న‌వ‌రి నుంచి 2017 నుంచి సెట్స్‌మీద‌కు వెళ్ల‌నుంద‌ట‌.

ntr

మొదట ఎన్టీఆర్ పూరీ జగన్నాథ్‌ తో సినిమా చేస్తాడని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దాదాపు సినిమా కన్ఫామ్ అయినంత పని అయింది. కానీ చివరికి తేలిపోయింది.ఆ తర్వాత వక్కంతం వంశీ, తమిళ్ డైరెక్టర్ ఇలా చాలా మంది పేర్లు వినిపించినా..చివరికి సర్ధార్ గబ్బర్ సింగ్ ఫేం..బాబీ అవకాశం ఇచ్చినట్టు టాలీవుడ్ వర్గాల్లో జోరు వార్తలు వినబడుతున్నాయి. మరి బాబీతో తన హ్యాట్రిక్ విజయపరం పరంను కొనసాగిస్తాడో లేదో చూడాలి.

- Advertisement -