జై లవకుశ… ఫస్ట్‌లుక్ డేట్ ఫిక్స్

192
Jr.NTR's Jai Lava Kusa Firstlook date fix
- Advertisement -

ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మించనున్న చిత్రం ‘జై లవకుశ’. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ మూడు విభిన్న పాత్రలలో కనిపించనున్నట్టు తెలుస్తుంది. ఒక పాత్ర పేరు లవకుమార్, మరో పాత్ర పేరు జై అని తెలుస్తుండగా మూడో పాత్రకు సంబంధించి క్లారిటీ రావలసి ఉంది. రాశిఖన్నా, నివేధా థామస్ లు కథానాయికలుగా నటించనున్నారు. హాలీవుడ్ టెక్నీషియన్ వాన్స్ గార్ట్ వెల్ ఈ చిత్రానికి పనిచేస్తున్నాడు.

బాబీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఆగస్ట్ రెండో వారంలో విడుదల కానున్నట్టు సమాచారం. ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేయనున్నట్టుగా వార్తలు వచ్చిన దగ్గర నుంచి, ఈ సినిమా ఫస్టులుక్ కోసం అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నెల 20వ తేదీన ఎన్టీఆర్ పుట్టిన రోజు కావడంతో, ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ నెల 19న ఫస్టులుక్ ను రిలీజ్ చేస్తున్నారు.

ఎన్టీఆర్ మూడు గెటప్స్ ను మిక్స్ చేస్తూ బాబీ ఈ ఫస్టులుక్ ను స్పెషల్ గా డిజైన్ చేయించినట్టు చెబుతున్నారు. టైటిల్ లోగోను ఆవిష్కరించినప్పుడు అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. అంతకి మించి అన్నట్టుగా ఫస్టు లుక్ వుండేలా చూస్తున్నారు. ఎన్టీఆర్ కెరీర్‌లోనే జై లవకుశ బిగ్గెస్ట్ హిట్ అవుతుందని అంతా భావిస్తున్నారు.

- Advertisement -