ముంబైలో పాప్ సంచ‌ల‌నం బీబర్..

201
Canadian popstar Justin Bieber is in India
- Advertisement -

హాలీవుడ్ పాప్ సింగర్ జస్టీన్ బీబర్ సంగీత అభిమానులకు సుపరిచితుడే. వయసులో చిన్నోడే ఐనా యువతను తన సంగీతంతో పిచ్చెక్కించడం జస్టీన్ సొంతం. అందుకే ఇతగాడికి  భారీ సంఖ్యలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ప్రపంచ పర్యటనలో భాగంగా తొలిసారిగా ఈ కెనడియన్ పాప్ స్టార్ తొలిసారి ఇండియాకు వచ్చాడు. త‌న పాట‌తో భార‌తీయుల్ని ఉర్రూత‌లూగించేందుకు బీబ‌ర్ మూడు రోజులు భార‌త్‌లో ఉండ‌నున్నారు.

మంగ‌ళ‌వారం అర్థ‌రాత్రి దాటిన త‌ర్వాత ముంబ‌యి ఎయిర్ పోర్ట్‌కు చేరుకున్న బీబర్‌కు ఘనస్వాగతం లభించింది. త‌న ప్రైవేట్ జెట్‌లో ఇండియాకు వ‌చ్చిన బీబర్ ఇవాళ డీవై ప‌టేల్ స్టేడియంలో ప్రత్యేక ప్రదర్శన ఇవ్వనున్నాడు. తన 120 మంది సభ్యుల బృందంతో కలిసి అభిమానులను ఉర్రూత లుగించనున్నాడు. ఇప్పటికే ముంబై, ఢిల్లీల్లోని రెండు ఫైవ్‌ స్టార్‌ హోటళ్లలో బీబర్‌ కోసం ప్రత్యేక సూట్లను సిద్ధం చేశారు. పాప్‌ సింగర్‌ అభిరుచి మేరకు ఆయా గదులను లావిష్‌గా ముస్తాబు చేశారు.

Canadian popstar Justin Bieber is in India
త‌న ప‌ర్య‌ట‌న‌లో భాగంగా బీబ‌ర్ ముంబ‌యి.. ఢిల్లీ.. అగ్రా.. జైపూర్‌ల‌ను సంద‌ర్శించ‌నున్నాడు. బాలీవుడ్ దిగ్గ‌జ నిర్మాత క‌ర‌ణ్ జోహార్ హోస్ట్ గా వ్య‌వ‌హ‌రించే కాఫీ విత్ క‌ర‌ణ్ షోలో బీబ‌ర్ పాల్గొన‌నున్నాడు. అంత‌ర్జాతీయ సెల‌బ్రిటీ అయిన బీబ‌ర్ ఇండియా ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా ప్ర‌త్యేక భ‌ద్ర‌తా ఏర్పాట్లు చేశారు.

బాలీవుడ్ దిగ్గ‌జ న‌టుడు స‌ల్మాన్ ఖాన్ బాడీగార్డ్ షెరా.. బీబ‌ర్ కు వ్య‌క్తిగ‌త సెక్యూరిటీ గార్డుగా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. అంతే కాదు.. స‌ల్మాన్ వ్య‌క్తిగ‌త భ‌ద్ర‌తా సిబ్బంది సైతం బీబ‌ర్‌కు సెక్యూరిటీగా ఉండ‌నున్నారు.

- Advertisement -