యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ మూవీ ” దేవర “. పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ సినిమా కోసం ఇండియన్ సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ మద్య విడుదలైన గ్లిమ్స్ వీడియో మూవీపై అంచనాలను మరింత పెంచేసింది. ఇక ఈ మూవీ ఏప్రెల్ 5 న విడుదల చేస్తామని గతంలోనే చిత్ర యూనిట్ ప్రకటించింది. ఆ మద్య విడుదలైన గ్లిమ్స్ వీడియోలో కూడా ఏప్రెల్ 5న రిలీజ్ అంటూ మరోసారి కన్ఫమ్ చేసింది. అయితే తాజాగా ఈ మూవీ పోస్ట్ పోన్ అయినట్లు టాక్ వినిపిస్తోంది. మూవీ షూటింగ్ ఇంకా పెండింగ్ ఉండడంతో సమ్మర్ రేస్ నుంచి దేవర తప్పుకున్నట్లు టాక్. .
తాజాగా విజయ్ దేవరకొండ ‘ ఫ్యామిలీ స్టార్ ‘ మూవీ ఏప్రెల్ 5 న విడుదల అని దిల్ రాజు ప్రకటించడంతో దేవర పోస్ట్ పోన్ కన్ఫర్మ్ అని తేలింది. అయితే దేవర మూవీని ఆగస్టులో విడుదల చేసేందుకు చిత్రా యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఆగస్టు లో మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప 2 వస్తున్న సంగతి తెలిసిందే. ఆగస్ట్ 15 న ‘ పుష్ప ది రూల్ ‘ రిలీజ్ కాబోతున్నట్లు చిత్రా యూనిట్ ఇటీవల మరోసారి కన్ఫర్మ్ చేసింది.
దీంతో ఒకవేళ ఎన్టీఆర్ దేవర మూవీ కూడా ఆగస్టు లో రిలీజ్ అయితే ఇండియన్ బాక్సాఫీస్ వద్ద భారీ క్లాష్ తప్పదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆర్ ఆర్ ఆర్ తో ఎన్టీఆర్ కూడా పాన్ ఇండియా స్థాయి లో క్రేజ్ సంపాదించుకున్నాడు. అటు అల్లు అర్జున్ పుష్ప మొదటి భాగంతో నార్త్ లో చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. దాంతో ఈ ఇద్దరి హీరోల మూవీస్ ఒకే నెలలో రిలీజ్ అయితే ఇండియన్ బాక్సాఫీస్ షేక్ అవ్వడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది. మరి ఈ బిగ్ ఫైట్ కు అవకాశం ఉందా అనేది తెలియాలంటే దేవర రిలీజ్ డేట్ ప్రకటించే వరకు వెయిట్ చేయాల్సిందే.
Also Read:TTD: రథసప్తమికి విస్తృత ఏర్పాట్లు