- Advertisement -
టాలీవుడ్ హీరో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఇవాళ రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి తహసీల్దార్ కార్యాలయానికి విచ్చేశారు. అయితే ఆయన శంకర్ పల్లి తహసీల్దార్ కార్యాలయానికి వచ్చింది ఓ భూమి రిజిస్ట్రేషన్ కోసమని తెలుస్తోంది. గోపాలపురం గ్రామ పరిధిలో ఆరున్నర ఎకరాల భూమికి సంబంధించిన వ్యవహారంపై ఎన్టీఆర్ రెవెన్యూ అధికారులతో మాట్లాడినట్టు సమాచారం. ఇక ఎన్టీఆర్ రాకతో ఆ ప్రభుత్వ కార్యాలయంలో సందడి వాతావరణం కనిపించింది. ఎన్టీఆర్ తో ఫొటోలు దిగేందుకు ఉద్యోగులు సైతం పోటీ పడ్డారు. ఎన్టీఆర్ ఎవరినీ నిరాశపర్చకుండా అందరికీ ఓపిగ్గా ఫొటోలకు పోజులిచ్చారు.
- Advertisement -