దంగల్ లో ఆమిర్ లా మారుతాడట..!

179
- Advertisement -

బాబీ డైరెక్షన్ లో రానున్న తన నెక్స్ట్ సినిమా కోసం భారీగా కసరత్తులు చేస్తున్నాడట యంగ్ టైగర్ ఎన్టీఆర్. సినిమా కోసం అంతగా కసరత్తులు ఎందుకుని అనుకుంటున్నారా? ఈ సినిమాలో తారక్ మూడు డిఫరెంట్ క్యారెక్టర్లు చేయబోతున్నాడు.
Jr NTR to work with Bobby
అందులో ఒక క్యారెక్టర్ కోసం వెయిట్ గా.. మరో క్యారెక్టర్ కోసం స్లిమ్ గా  కనిపించాల్సి ఉందట.అందుకే ఈ మూడు పాత్రల్లో వేరియేషన్స్ చూపించాలని ఎన్టీఆర్ కసరత్తులు చేస్తున్నట్లు సమాచారం. అంటే.. ఈ సినిమాలో మళ్ళీ బొద్దుగా ఉండే తారక్ ని చూడబోతున్నామన్న మాట. అంతే కాదు మరో పాత్ర కోసం సిక్స్ ప్యాక్ లోనూ కనిపిస్తాడని తెలుస్తోంది. ఇందుకోసం టెంపర్ సినిమా సమయం నుంచే.. ఎన్టీఆర్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడని తెలుస్తోంది. ఈ సినిమా కోసం తారక్ ఇంత రిస్క్ తీసుకుంటున్నాడంటే బాబీ చెప్పిన కథ ఎంత ఇంప్రెస్ చేసి ఉంటుందోనని అంతా అనుకుంటున్నారు.

- Advertisement -