కన్నడ సినిమాపై మనసుపడ్డ ఎన్టీఆర్..!

243
NTR Jr to remake Kannada movie..!
- Advertisement -

ఎన్టీఆర్ టాలీవుడ్‌లో తనదైన ట్రెండ్ సెట్ క్రియేట్ చేస్తూ అగ్రహీరోగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పటివరకు ఎన్టీఆర్‌ చేసిన ఇతర భాషల్లో రిమేక్ అయ్యాయి కానీ తారక్ మాత్రం రిమేక్ సినిమాల వైపు కన్నెత్తిచూడలేదు. కానీ ప్రస్తుతం ఎన్టీఆర్ మనసు మార్చుకున్నట్లు టీ టౌన్‌లో ప్రచారం జరుగుతోంది. అది కూడా శాండల్‌వుడ్‌లో  హిట్ అయిన రాజకుమార సినిమాను తెలుగులో రిమేక్ చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన చేస్తున్నాడట.

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ హీరోగా నటించిన  ఈ సినిమా మంచి కలెక్షన్లను సాధించి పెట్టింది. ఇటీవలె  వంద రోజులను పూర్తి చేసుకుంది. ఈ క్రమంలో దాన్ని రీమేక్ చేయడానికి దక్షిణాది భాషల వాళ్లు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్‌ కూడా మనసు పారేసుకున్నాడట.

పునీత్ రాజ్ కుమార్ తో తారక్ కు సన్నిహిత సంబంధాలున్నాయి. కొంత కాలం కిందట కన్నడలో విడుదల అయిన పునీత్ సినిమా ‘చక్రవ్యూహ’కోసం తారక్ ఒక పాట కూడా పాడాడు. అంత సాన్నిహిత్యం ఉంది ఈ హీరోల మధ్య. ఈ నేపథ్యంలోనే రీమేక్ ప్రతిపాదన వచ్చినట్టుగా తెలుస్తోంది.

NTR Jr to remake Kannada movie..!
ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో జై లవ కుశ సినిమా పనుల్లో బిజీగా ఉన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఆ తరువాత చేయబోయే సినిమాను ఇంత వరకు ప్రకటించలేదు. సినిమాతో పాటు తొలిసారిగా బుల్లితెర ఎంట్రీ ఇస్తూ బిగ్ బాస్ షో కూడా చేస్తున్నాడు జూనియర్. ఈ రెండు ప్రాజెక్ట్ ల తరువాత ఎన్టీఆర్ చేయబోయే సినిమా ఏంటీ అన్న చర్చ మొదలైంది. స్టార్ డైరెక్టర్లు ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి ఎదురుచూస్తున్నారు. జూనియర్ మాత్రం ఇంత వరకు ఏ ప్రాజెక్ట్ ను కన్ఫామ్ చేయలేదు.

రాజమౌళి, త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి టాప్ డైరెక్టర్స్ తో ఎన్టీఆర్ నెక్ట్స్  సినిమా అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా మరో ఇంట్రస్టింగ్ ప్రాజెక్ట్ వార్తల్లోకి వచ్చింది.  మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో లేదో తెలియాలంటే తారక్ అండ్ కో స్పందించాల్సిందే…

- Advertisement -